Hyundai i20 EMI Calculator: హ్యూందాయ్ ఐ20ఒక 5-సీటర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. ఈ కారు 7 రంగుల వేరియంట్‌లతో మార్కెట్‌లో ఉంది. ఇందులో i20 బ్రాండింగ్‌తో డ్యూయల్ టోన్ సీట్లు ఉన్నాయి. ఈ కారులో ఫాస్ట్ USB టైప్ C ఛార్జింగ్ పాయింట్ ఉంది. హ్యూందాయ్ ఈ కారులో పూర్తిగా ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ (FATC) సిస్టమ్ అమర్చారు. హ్యూందాయ్ ఐ20 హైదరాబాద్ ఆన్ రోడ్ ధర రూ. 6,86,865 నుంచి ప్రారంభమై రూ. 10.43 లక్షల వరకు ఉంటుంది.
Hyundai i20 పవర్
హ్యూందాయ్ ఐ20లో 1.2 కప్పా పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. కారులో ఉన్న ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 61 KW పవర్‌ని అందిస్తుంది. అదే సమయంలో, 4,200 rpm వద్ద 114.7 Nm టార్క్ లభిస్తుంది. ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. అలాగే, ఈ కారు ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్‌తో వస్తుంది. హ్యూందాయ్‌కు చెందిన ఈ కారు ముందు భాగంలో డిస్క్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.
EMIపై హ్యూందాయ్ ఐ20ని ఎలా కొనుగోలు చేయవచ్చు?
హ్యూందాయ్ ఐ20 బేస్ మోడల్ హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర రూ.6,86 లక్షలు. ఈ కారును రూ.83,000 డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు. మీరు కోరుకుంటే, ఎక్కువ డబ్బు డౌన్ పేమెంట్ గా చెల్లించి, ప్రతి నెలా తక్కువ EMIని చెల్లించవచ్చు. కానీ మీరు హ్యాందాయ్ ఈ కారును కొనుగోలు చేయడానికి రూ.83,000 డౌన్ పేమెంట్ చేస్తే, అప్పుడు ప్రతి నెలా కారు లోన్ పై ఎంత EMI చెల్లించాలో తెలుసుకుందాం.
హ్యాందాయ్ ఐ 20ని కొనుగోలు చేయడానికి మీరు 4 సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే, 9 శాతం వడ్డీతో 48 నెలల పాటు రూ.18,560చెల్లించాలి.
హ్యాందాయ్‌కు చెందిన ఈ కారును మీరు 5 సంవత్సరాల లోన్ తీసుకుంటే, 9 శాతం వడ్డీతో ప్రతి నెలా రూ. 15,482 EMI చెల్లించాలి.
హ్యాందాయ్‌కు చెందిన ఈ కారును 6 సంవత్సరాల లోన్ పై కొనుగోలు చేస్తే, 9 శాతం వడ్డీతో ప్రతి నెలా బ్యాంకులో రూ. 13,444జమ చేయాలి.
హ్యాందాయ్‌కు చెందిన ఈ కారును 7 సంవత్సరాల లోన్ తీసుకుంటే, ప్రతి నెలా రూ. 12,000 EMI చెల్లించాలి.