Donald Trump Apple: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను చూసి కుళ్లుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఐ ఫోన్‌లు, ముఖ్యంగా అమెరికాకు ఎగుమతి అయ్యే అన్ని ఐ ఫోన్లు భారత్‌లో తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాక్యలు చేశారు. ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో భారత్‌లో ఐఫోన్‌ల తయారీని నిలిపివేయాలని, బదులుగా అమెరికాలోనే ఉత్పత్తి కొనసాగించాలని సూచించారు. భారత్‌లో అధిక సుంకాలు ఉన్నాయని, ఇది అమెరికా కంపెనీలకు అనుకూలం కాదని ట్రంప్ చెప్పారు. ఖతార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ట్రంప్ ప్రకటించారు.
యాపిల్ ఇప్పటికే భారత్‌లో ఐఫోన్‌ల తయారీని విస్తరించింది, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులపై ట్రంప్ సుంకాలు పెంచిన తర్వాత భారత్‌లో తయారీ ద్వారా ఈ సుంకాలను నివారించేందుకు యాపిల్ భారత్‌పై దృష్టి సారించింది. 2026 నాటికి అమెరికా మార్కెట్ కోసం ఐఫోన్‌ల తయారీని పూర్తిగా భారత్‌కు మార్చాలని యాపిల్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. ట్రంప్ భారత్‌పై 27 శాతం ప్రతీకార సుంకాలు విధించినట్లు ప్రకటించారు. తర్వాత 90 రోజుల పాటు వాయిదా వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారత్‌లో 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను తయారు చేసింది. ఇటీవల 15 లక్షల ఐఫోన్‌లను చెన్నై నుంచి అమెరికాకు ఎగుమతి చేసింది.
చైనాతో వాణిజ్య యుద్ధం కారమంగా జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ భాగాన్ని భారతదేశంలోనే ఉత్పత్తి చేస్తున్నారు. ఆపిల్ రాబోయే కొన్ని సంవత్సరాలలో మొత్తం ఐఫోన్ ఉత్పత్తిలో నాలుగో వంతును భారతదేశానికి తరలించాలని కోరుకుంటోంది, ఇప్పటివరకు కంపెనీ తయారీ నైపుణ్యానికి కీలక కేంద్రంగా ఉన్న చైనా నుండి క్రమంగా దూరంగా వెళ్లాలని కోరుకుంటోంది.
కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించిన తర్వాత పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో కుక్ ఈ వ్యాఖ్య చేసినప్పటి నుండి కీలక పరిణామాలు చోటు చేసుకుటున్నాయి. సుంకాల రేట్లపై అమెరికా , నా మధ్య ఒప్పందం కుదిరింది. అమెరికాలో తయారీ అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం . అందుకే పలు సంస్థలు తమ ఉత్పత్తుల్ని చైనా, భారత్‌లో తయారు చేస్తూ ఉంటాయి.