Prabhu Deva's Jolly O Gymkhana OTT Streaming: ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'జాలీ ఓ జింఖానా'. ఈ మూవీ జనవరిలో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతుండగా.. డైరెక్ట్‌గా ఓటీటీలోనే అందుబాటులోకి వచ్చింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

కోలీవుడ్‌లో థియేటర్‌లో రిలీజ్ అయి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా' (Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 'హత్యనా, మిస్టరీనా, పిచ్చినా.. ఈ కుటుంబానికి ఏం జరుగుతుందో తెలియదు.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ సినిమాకు శక్తి చిదంబర్ దర్శకత్వం వహించగా.. ప్రేమమ్ ఫేం మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్‌ళీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Also Read: క్షణ క్షణం ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - 'అయ్యనా మానే' తెలుగులోనూ వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

స్టోరీ ఏంటంటే?

అనుకోని పరిస్థితుల్లో చనిపోయిన ఓ వ్యక్తిని బతికున్నట్లు చూపించడం కోసం ఓ కుటుంబం ఏం చేసిందనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఈ మూవీని రూపొందించారు. ఇక కథ విషయానికొస్తే.. ఓ అమ్మాయి తాను చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తంగా తన స్టోరీ చెప్పుకోవడానికి ఓ చర్చిలో ఫాదర్ దగ్గరకు రావడంతో సినిమా ప్రారంభం అవుతుంది. తంగసామి అనే వ్యక్తి తన కూతురు, మనవరాళ్లతో కలిసి ఓ హోటల్ నడుపుతుంటాడు. వీరికి అనుకోకుండా ఆ ప్రాంత ఎమ్మెల్యేతో గొడవ జరుగుతుంది.

ఈ ఘర్షణలో తంగసామి తీవ్రంగా గాయపడగా.. ఆపరేషన్ కోసం రూ.25 లక్షలు ఖర్చవుతుంది. ఆ డబ్బు అనుకోకుండా ఆ మహిళల అకౌంట్లోకి రాగా ఆపరేషన్ సజావుగా సాగిపోతుంది. ఇదే సమయంలో ఆ డబ్బు కోసం ఓ గ్యాంగ్ వీళ్ల వెంటపడుతుంది. ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఆ మహిళలు లాయర్‌ను కలిసేందుకు వెళ్తారు. అయితే.. వీరు వెళ్లే సరికే ఆ లాయర్ చనిపోయి ఉంటాడు. ప్రపంచానికి మాత్రం ఆ లాయర్ బతికే ఉంటాడు. అసలు ఆ లాయర్‌ను మర్డర్ చేసింది ఎవరు? ఆ లాయర్‌ బతికే ఉన్నాడని ఎందుకు ఈ మహిళలు నమ్మించాల్సి వచ్చింది?, న్యాయవాది శవంతో తమ సమస్యలను వీరు ఎలా పరిష్కరించుకున్నారు? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.