DNPA Survey Digital News Serving: రాను రానూ వార్తలు పాఠకుల్ని చేరే మాధ్యమాలు విపరీతంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు సంగతుల్ని పేపర్‌లో చదివి తెలుసుకునే వాళ్లు. ఆ తరవాత వార్తా ఛానళ్లు వచ్చాయి. ఈ మార్పు అంతటితో ఆగలేదు. ఇప్పుడంతా వార్తల్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో చదివేస్తున్నారు. చేతిలోనే ప్రపంచం నలుమూలన జరిగే వార్తను తెలుసుకోగలుగుతున్నారు. వార్తల్ని చదవడం కన్నా స్కాన్ చేయడం ఎక్కువైపోయింది. జనాలు సింపుల్‌గా తేల్చేసే పరిస్థితి వచ్చింది. కొన్నేళ్లుగా డిజిటల్‌ జర్నలిజం మార్కెట్ ఇండియాలో బాగా పెరిగిపోయింది. షార్ట్ వీడియో ఫార్మాట్‌కి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ మార్పులపైనే Digital News Publishers Association (DNPA) ప్రత్యేకంగా ఒక సర్వే చేపట్టింది. డిజిటల్ పాఠకుల అభిప్రాయాలు ఏమిటో అడిగి తెలుసుకుంది.


సర్వే కోసం ఇక్కడ క్లిక్ చేయండి


వీడియో కంటెంట్‌కే అమితమైన ఆదరణ..


ఒకప్పుడు వార్తల్ని తెలుసుకోవాలంటే టెక్స్ట్ ఫార్మాట్‌పైనే ఎక్కువగా అందుబాటులో ఉండేది. ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులోకి వచ్చాక కూడా ఇదే ధోరణి కొనసాగింది. స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరిగాక కూడా పరిస్థితి ఇలాగే ఉండేది. కానీ, స్మార్ట్ ఫోన్స్ తో పాటుగా 4జీ, 5జీ ఆగమనంతో వార్తల విషయంలో పెను మార్పు వచ్చింది. ఇన్‌ఫర్మేటివ్‌గా ఉన్న వార్తల్ని తెలుసుకోవాలనుకుంటున్నప్పటికీ అవి వీడియోల రూపంలో ఉంటేనే జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. షార్ట్‌ వీడియో కంటెంట్‌కి అందుకే డిమాండ్ అంతగా పెరిగిపోయిందని డీఎన్‌పీఏ సర్వేలో (DNPA Survey) తేలింది. అందుకే చాలా మంది కంటెంట్ క్రియేటర్స్‌ యూట్యూబ్ ఛానల్స్‌కి పాపులర్ అయిపోతున్నారు. 


DNPA Survey సర్వేలో ఏం తేలింది?


వీడియో ఫార్మాట్‌ వార్తల ప్రజంటేషన్‌లోనే కాదు వార్తల్ని తెలుసుకోవాలనుకునే వాళ్ల మైండ్‌ సెట్‌నీ మార్చేసింది. ఏ వార్తనైనా సరే అది వీడియో రూపంలో ఉంటేనే ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసినా, వివాదాస్పద కామెంట్స్ చేసినా ఆ బైట్‌ కోసమే వెతుకుతున్నారు. ఈ బైట్‌ని వినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని DNPA సర్వేలో తేలింది. సోషల్ మీడియానే ప్రైమరీ సోర్స్‌గా భావిస్తున్నారు. అందుకే డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్స్ సోషల్ మీడియాపై అంతగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. న్యూస్‌ ఫీడ్‌లో ఎక్కువగా వీడియో కంటెంట్‌ ఉండేలా చూస్తున్నాయి. 


సర్వేలో మీ అభిప్రాయాలు చెప్పండి


ఆ వార్తలకే డిమాండ్


ఈ సర్వేలో భాగంగా DNPA నేరుగా పాఠకుల నుంచే అభిప్రాయాలు సేకరించింది. కంటెంట్‌ ఎంగేజింగ్‌గా ఉంటే తప్ప పెద్దగా పట్టించుకోమని తేల్చి చెప్పారు పాఠకులు. అంతే కాదు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఉండే వార్తలకే ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. ఈ మేరకు డిజిటల్ న్యూస్ ఇకో సిస్టమ్‌లో మార్పులు చేయాల్సి వస్తోంది. వార్తల ట్రెండ్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు న్యూస్ ప్లాట్‌ఫామ్స్‌కి సమాచారం అందిస్తుంది Digital News Publishers Association లేదా DNPA. ఈ డీఎన్‌పీఏలో మొత్తం 17 ఇండియన్ మీడియా ఆర్గనైజేషన్స్‌ ఉన్నాయి.