DLS Creator Duckworth Passes : క్రికెట్ లో వినియోగించే డక్ వర్త్ లూయిస్ (డిఎల్ఎస్) విధానం సహరూప కర్త ప్రాంక్ డక్ వర్త్ (84) కన్నుమూశారు. మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో వర్షం పడితే ఫలితం రాబట్టేందుకు ఉపయోగించే ఈ పద్ధతిని ఇంగ్లాండ్ చెందిన డక్ వర్త్, టోనీ లూయిస్ రూపొందించారు. దీనిని 1997లో మొదటిసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి అమోదంతో ఉపయోగించారు. వీరి గౌరవార్థం ఈ విధానానికి వారి పేరునే పెట్టారు. ఈ విధానాన్ని రూపొందించిన వారిలో ఒకరైన డక్ వర్త్ తాజాగా మృతి చెందారు. 84 ఏళ్ల డక్ వర్త్ ఈ నెల 21న వృద్ధాప్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ రూపొందించిన ఈ డక్ వర్త్ లూయిస్ విధానానికి ఆస్ట్రేలియా కు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్ కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అప్పటి నుంచి డిఎల్ కాస్త.. డక్ వర్త్ - లూయిస్ - స్టెర్న్ డిఎల్ఎఫ్ గా స్థిరపడింది.
ఈ విధానాన్ని ఎప్పుడూ వినియోగిస్తారు అంటే
డక్ వర్త్ లూయిస్ విధానాన్ని వర్షం పడిన సందర్భాల్లో వినియోగిస్తుంటారు. ఈ విధానం రావడానికి ముందు వర్షం పడితే మ్యాచ్ రద్దు చేసేవారు. అప్పటికే ఒక జట్టు కొంతవరకు మ్యాచ్ ఆడినప్పటికీ ఈ విధానం లేకపోవడం వల్ల మ్యాచ్ ను రద్దు చేసే పరిస్థితి క్రికెట్లో ఉండేది. వర్షం తగ్గితే మ్యాచ్ నిర్వహించేవారు. లేకపోతే రద్దు చేయడం మరో రోజు నిర్వహించడం చేసేవారు. అయితే ఈ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత మ్యాచ్ ను వర్షం తగ్గిన తర్వాత నిర్వహించడం, అప్పటికే మ్యాచ్ జరిగి ఉంటే ఇరుజట్ల ఆటను పరిశీలించి ఈ విధానంలో విజేతను ప్రకటిస్తూ వస్తున్నారు. దీనివల్ల అనేక మ్యాచ్ ల్లో ఫలితాలు తేలుతున్నాయి. వర్షం వల్ల మ్యాచ్కు అంతరాయం ఏర్పడినప్పుడు మ్యాచ్ ఫలితాన్ని తేల్చాలంటే లక్ష్యాన్ని సవరించేందుకు డిఎల్ఎఫ్ ను ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికీ అంతర్జాతీయంగా అనేక మ్యాచ్ లకు సంబంధించిన ఫలితాలను ఈ విధానం ద్వారానే వర్షం పడినప్పుడు తేల్చుతున్నారు.
క్రికెట్ వర్గాల నుంచి సంతాపం
డక్ వర్త్ మృతి పట్ల క్రికెట్ వర్గాల నుంచి విస్మయం వ్యక్తం అవుతోంది. క్రికెట్ కు ఆయన అందించిన విధానం ఎంతగానో మేలు చేస్తోందని పలువురు క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఆయన మృతి తీరని లోటు అంటూ పలువురు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.