Dell to Stop WFH: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ ఆప్షన్‌పై చాలా సీరియస్ అవుతోంది డెల్ కంపెనీ. ఇకపై ఇంటి నుంచి పని చేయడం కుదరదని, అందరూ ఆఫీస్‌లకు రావాలని తేల్చి చెబుతోంది. అయితే..కొంత మంది ఉద్యోగులు మాట (WFH in Dell) వినకుండా ఇంటి నుంచే పని కొనసాగిస్తున్నారు. అలాంటి ఉద్యోగులందరిపైనా ఇకపై సంస్థ నిఘా పెట్టనుంది. అందుకోసం ప్రత్యేకంగా human capital management software ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆన్‌సైట్‌లో ఎంత మంది ఉంటున్నారు..? ఎంత ఎఫెక్టివ్‌గా పని చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్లకి కలర్ కోడెడ్ రేటింగ్స్ (Dell Rules on Work From Home) ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రేటింగ్స్ ప్రకారం ఓ ఉద్యోగికి బ్లూ ఫ్లాగ్ ఇచ్చిందంటే...ఆ వ్యక్తి రెగ్యులర్‌గా ఆఫీస్‌కి వస్తున్నట్టు లెక్క.


ఆన్‌సైట్‌కి రెగ్యులర్‌గా వచ్చే ఉద్యోగులకు గ్రీన్ ఫ్లాగ్‌ ఇవ్వనుంది కంపెనీ. తరచూ ఆఫీస్‌కి రాని వాళ్లకి రెడ్ ఫ్లాగ్‌ ఇవ్వనుంది. అంతే కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న వాళ్లు సరిగ్గా పని చేస్తున్నారా లేదా అన్నదీ ట్రాక్ చేయనుంది. VPN కనెక్షన్స్‌ ట్రాక్ చేస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే లేఆఫ్‌లతో ఉద్యోగులను భయపెడుతున్న కంపెనీ ఇప్పుడీ కొత్త రూల్స్‌తో మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ కొత్త నిబంధనలపై మేనేజర్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌పై నిఘా పెట్టడం మొదలు పెడితే ఉద్యోగులు గిల్టీగా ఫీల్ అయ్యే ప్రమాదముందని అంటున్నారు. ఫలితంగా మొత్తంగా అది ప్రొడక్టివిటీపై ప్రభావం చూపించే అవకాశముందని వివరిస్తున్నారు. ఆ ఉద్యోగులందరూ లేఆఫ్‌లకు గురయ్యే ప్రమాదమూ ఉందని అభిప్రాయపడుతున్నారు. 


ఆఫీస్‌కి వస్తేనే బెటర్..


అయితే...ఈ రూల్స్‌పై డెల్‌ వాదన మరోలా ఉంది. ఇప్పటికే హైబ్రిడ్ వర్క్ పాలసీ గురించి ఉద్యోగులందరికీ సమాచారం అందించామని, అయినా కొందరు పట్టించుకోవడం లేదని తేల్చి చెబుతోంది. మూడు నెలల్లో కనీసం 39 రోజుల పాటు ఆన్‌సైట్‌లో పని చేయాలన్నది కంపెనీ పెట్టిన రూల్. కానీ కొంత మంది ఉద్యోగులు ఈ నిబంధనలకు తగ్గట్టుగా ఆఫీస్‌లకు రావడం లేదని చెబుతోంది డెల్ యాజమాన్యం. ప్రొడక్టివిటీ పెరగాలంటే ఇలా ఉద్యోగులందరూ ఒకేచోట పని చేయడమే మంచిదని స్పష్టం చేస్తోంది. డెల్ మాత్రమే కాదు. ఇప్పటికే చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌పై కాస్త అసహనంగానే ఉంటున్నాయి.


నిన్న మొన్నటి వరకూ హైబ్రిడ్ మోడల్‌ని ఫాలో అయిన సంస్థలు కూడా ఇప్పుడు పూర్తిగా ఆఫీస్‌లకు రావాలని మెయిల్స్ పంపుతున్నాయి. అయితే...ఇప్పటికే వర్క్ ఫ్రమ్‌ హోమ్‌కి అలవాటు పడిపోయిన ఉద్యోగులు మాత్రం ఇందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కొందరైతే మరీ ఒత్తిడి తెస్తే కంపెనీ మారిపోతున్నారు. మరేదో కారణం చెప్పి అక్కడి నుంచి బయట పడుతున్నారు. అటు పని గంటల గురించి కూడా గట్టిగానే చర్చ జరుగుతోంది. వర్కింగ్ అవర్స్ పెంచాలని కొందరు వాదిస్తుంటే మరి కొందరు మండి పడుతున్నారు. మొత్తానికి వర్క్ ఫ్రమ్‌ హోమ్ ఆప్షన్‌పై సంస్థల వైఖరి మారుతోంది.   


 Also Read: Viral Video:ఫ్లైట్‌లో సీట్‌ కోసం కొట్టుకున్న ప్రయాణికులు, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు - వీడియో వైరల్