Viral Video: బస్సుల్లో సీట్ కోసం ప్రయాణికులు దెబ్బలాడుకోడం చూశాం. కానీ విమానాల్లోనూ ఇవే సీన్స్ రిపీట్ అవుతున్నాయి. తోటి ప్యాసింజర్స్‌కి ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనే లేకుండా కొందరు వింతగా ప్రవర్తిస్తున్నారు. తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న EVA ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఇద్దరు ప్రయాణికులు సీట్ కోసం గొడవ పడ్డారు. New York Post వెల్లడించిన వివరాల ప్రకారం...జర్నీలో ఉండగానే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పక్కనే ప్రయాణికుడు పదే పదే దగ్గుతున్నాడన్న కారణంగా ఓ ప్యాసింజర్ తన సీట్ మార్చుకోవాలని అనుకున్నాడు. మరొకరి సీట్‌లో కూర్చున్నాడు. ఆ ప్రయాణికుడు కాసేపటి తరవాత వచ్చి తన సీట్‌ని ఆక్యుపై చేసినట్టు గుర్తించాడు. కూర్చున్న వ్యక్తిపై దాడి చేశాడు. అలా మొదలైన ఘర్షణ చాలా సేపటి వరకూ కొనసాగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. ఫ్లైట్ సిబ్బంది ఇద్దరినీ వారించి సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. ఈ గొడవనంతా ఓ ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది వైరల్ అయిపోయింది. తోటి ప్యాసింజర్స్ అంతా గట్టిగా అరుస్తూ గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఫ్లైట్ సిబ్బందిలో ఒకరికి గాయమైంది. ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఎంతకీ ఎవరూ వెనక్కి తగ్గకపోవడం వల్ల సిబ్బంది శాన్‌ఫ్రాన్సిస్కోలో పోలీసులకు అప్పగించింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు కొందరు ప్యాసింజర్స్.
Viral Video:ఫ్లైట్‌లో సీట్ కోసం కొట్టుకున్న ప్రయాణికులు, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు - వీడియో వైరల్
Ram Manohar | 09 May 2024 12:31 PM (IST)
Viral Video: తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న ఫ్లైట్‌లో సీట్ కోసం ఇద్దరు ప్రయాణికులు గొడవ పడిన వీడియో వైరల్ అవుతోంది.
తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న ఫ్లైట్‌లో సీట్ కోసం ఇద్దరు ప్రయాణికులు గొడవ పడిన వీడియో వైరల్ అవుతోంది.