Delhi News: 


రెండు గ్రూపుల మధ్య గొడవ..


ఢిల్లీలోని జమియా మిల్లియా ఇస్లామియా (Jamia Millia Islamia) విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. అది కాస్త తీవ్రమై కాల్పులు జరిపే వరకూ వెళ్లింది. ఓ విద్యార్థిని మరో విద్యార్థి తుపాకీతో కాల్చాడు. జమియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో లైబ్రరీలో ఇద్దరి మధ్య రాత్రి వాగ్వాదం జరిగింది. ఆ సమయంలోనే ఓ విద్యార్థి మరో విద్యార్థిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగిందనీ వివరించారు. ఈ గొడవలో 26 ఏళ్ల నౌమన్ చౌదరికి తీవ్ర గాయాల పాలయ్యాడు. హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో చికిత్స పొందు తున్నాడు. అయితే...ఈ బాధితుడిని చూసేందుకు నౌమన్ అలీ అనే మరో విద్యార్థి హాస్పిటల్‌కు వచ్చాడు. ఆ సమయంలోనే జలాల్ అనే విద్యార్థి తన గ్రూప్‌తో వచ్చి హాస్పిటల్‌లోనే గొడవకు దిగాడు. నౌమన్ అలీపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ గ్రూపుల మధ్య అసలు ఎందుకు గొడవ అయింది అని పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడిని AIIMS ట్రామా సెంటర్‌కు తరలించారు. క్రైమ్‌ టీమ్ రంగంలోకి దిగి ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ చేపడుతోంది. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియో ట్విటర్‌లో పోస్ట్ చేయగా...వైరల్ అవుతోంది. 










సెక్షన్ 144 


రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ వార్డ్‌లో ఉన్నారు. ఈ గొడవల్లో ఆసుపత్రి సిబ్బంది ఎవరూ గాయపడలేదు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని...పోలీసులు తెలిపారు. క్యాంపస్ బయటకు వచ్చి గుంపులుగా తిరగొద్దని, 144సెక్షన్ అమల్లో ఉందని జమియా మిల్లియా యూనివర్సిటీ యాజమాన్యం...విద్యార్థులకు, 
టీచర్లకు సూచించింది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచే...ఈ గొడవలు జరుగుతున్నాయని...వీటిని కంట్రోల్ చేసేందుకే...ఆ యూనివర్సిటీ పరిధిలో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారని చెబుతున్నారు. 


Also Read: దుర్గం చెరువులో దూకిన యువతి, 24 గంటల తర్వాత మృతదేహం లభ్యం!