Delhi Liquor Scam Case: 'జైలు తాళాలు బద్దలు కొడతాం'- గుజరాత్‌లో జోరుగా కేజ్రీవాల్ ప్రచారం

ABP Desam   |  Murali Krishna   |  20 Oct 2022 04:21 PM (IST)

Delhi Liquor Scam Case: మనీశ్ సిసోడియా స్వేచ్ఛగా బయటకు వస్తారని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు.

'జైలు తాళాలు బద్దలు కొడతాం'- గుజరాత్‌లో జోరుగా కేజ్రీవాల్ ప్రచారం

Delhi Liquor Scam Case: దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనీశ్ సిసోడియా త్వరలోనే బయటకు వస్తారని అన్నారు. గుజరాత్‌లోని ఉంజాలో జరిగిన బహిరంగ సభలో కేజ్రీవాల్.. దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ప్రశంసించారు.

మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేస్తారు. డిసెంబర్ 8వ తేదీ తరవాత గుజరాత్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాకే ఆయనను విడుదల చేస్తారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనకుండా చేయటమే వాళ్ల వ్యూహం. మనీశ్ సిసోడియా ఏ తప్పూ చేయలేదు. ఆయనను ఎవరూ ఏం చేయలేరు.                                                  - కేజ్రీవాల్, దిల్లీ సీఎం

జైలు తాళాలు

మనీశ్ సిసోడియా సీబీఐ కార్యాలయానికి విచారణ కోసం వెళ్లిన తర్వాత కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు. "జైలు తాళాలు పగులుతాయి, మనీష్ సిసోడియా బయటకు వస్తారు" అని కేజ్రీవాల్ హిందీలో ఓ ట్వీట్ కూడా చేశారు.

విచారణకు

ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం దిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ అగ్ర నేత మనీష్ సిసోడియా సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆయనకు సీబీఐ ఆదివారం సమన్లు జారీ చేసింది. సీబీఐ కార్యాలయానికి చేరుకునేముందు సిసోడియా ఓ ట్వీట్ చేశారు.

నాపై పూర్తిగా ఫేక్ కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారానికి గుజరాత్ వెళ్లాల్సి ఉంది. వాళ్లు (భాజపా) గుజరాత్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోబోతున్నారు. అందుకే నన్ను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా చేయడమే వారి ఉద్దేశం. "

-                                                         మనీశ్ సిసోడియా, దిల్లీ డిప్యూటీ సీఎం
 
Published at: 17 Oct 2022 05:26 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.