Life of Vehicles in Delhi: ఢిల్లీ ప్రభుత్వం వాహనాలకు సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కాలం చెల్లిన వాహనాలను రోడ్లపైకి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఫోర్ వీలర్స్‌ అయితే రూ.10 వేల జరిమానా కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. టూ వీలర్స్‌కి రూ.5 వేల పెనాల్టీ తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు అందాయి. అన్నిచోట్లా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని ఆదేశించింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి డెయిలీ రిపోర్ట్‌లు పంపాలని అధికారులు వెల్లడించారు. కాలం చెల్లిన వాహనాల్ని సిటీకి దూరంగా తీసుకెళ్లిపోవాలని స్పష్టం చేశారు. పర్యావరణ శాఖకి ఎప్పటికప్పుడు ఈ నివేదికలు పంపాల్సి ఉంటుంది. వాటిని Commission for Air Quality Management (CAQM)కి సబ్మిట్ చేస్తారు. ప్రభుత్వం వాహనాల్ని రెండు కేటగిరీలుగా విభజించింది. ఢిల్లీ-NCR నుంచి వేరే ప్రాంతానికి తరలించడం, సిటీ వెలుపల ప్రైవేట్‌ స్పేసెస్‌లలో వీటిని పార్క్‌ చేయడం.


"కాలం చెల్లిన వాహనాల్ని బహిరంగంగా పార్కింగ్ చేయడం చట్టరీత్యా నేరం. ఢిల్లీ సిటీలో ఎక్కడా ఇవి కనిపించకూడదు. ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఫోర్ వీలర్స్‌కి అయితే రూ.10 వేల జరిమానా విధిస్తాం. టూ వీలర్స్‌ అయితే రూ.5 వేల పెనాల్టీ కట్టాలి. అంతే కాదు. పార్కింగ్ ప్లేసెస్ రూల్స్‌ ప్రకారం భారీ మొత్తంలో ప్రత్యేకంగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. 2019 నాటి చట్టం నిబంధనల ప్రకారం ఈ జరిమానాలు విధిస్తారు"


- అధికారులు 


పదేళ్లకి మించిన డీజిల్ వాహనాలు రోడ్లపైకి రాకుండా ఆంక్షలు విధించింది. అలాంటి వెహికిల్స్‌ ఓసారి పట్టుబడితే వాటిని విడుదల చేయాలంటే అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు అధికారులు. మూడు వారాల్లోగా ఈ డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే ఆ వెహికిల్‌ని స్క్రాప్‌ కింద పరిగణిస్తారు. అప్లికేషన్ రిజెక్ట్ అయినా చెత్తకిందకే వస్తుంది. 


వాహనాల నుంచి వచ్చే కాలుష్యాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. 2027 నాటి దేశంలో డీజిల్‌తో నడిచే ఫోర్-వీలర్ వాహనాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నివారించాలని భావిస్తోంది. వాహనాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలను తగ్గించేందుకు వినియోగదారులు ఎలక్ట్రిక్, గ్యాస్ తో నడిచే వాహనాలకు మారేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని  చమురు మంత్రిత్వ శాఖ ప్యానెల్ సూచించింది. భారత్ లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్గారాలను వెదజల్లే వాహనాల వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2070 నాటికి దేశంలో ఉద్గారాలను వెదజల్లే వాహనాలు లేకుండా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన చమురు శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నేతృత్వంలోని ఇంధన పరివర్తన సలహా కమిటీ కీలక సిఫార్సులు చేసింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన చమురు శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నేతృత్వంలోని ఇంధన పరివర్తన సలహా కమిటీ కీలక సిఫార్సులు చేసింది. 2030 నాటికి, పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్  సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలి సూచించింది.  2024 నుంచి ఎక్కువ జనాభా ఉన్న నగర రవాణా కోసం డీజిల్ బస్సులను వినియోగించకూడదనే నిబంధనను తీసుకురావాలని వెల్లడించింది.