Delhi CM residence forcibly vacated  Atishi belongings removed : ముఖ్యమంత్రి మాటకు ఎవరైనా ఎదురు చెబుతారా .. చాన్సే ఉండదు. ఇంకా చెప్పకుండానే ఆయన మనసులో మాటల్ని తెలుసుకుని దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసే అధికారులు ఉంటారు.కానీ ఢిల్లీలో మాత్రం భిన్నం. సీఎం  పదవి చేపట్టినా అతీషికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. ఆ ఇంట్లోకి ప్రస్తుతం సీఎం అతీషి వెళ్లాల్సి ఉంది. అందుకే తమ సామాన్లు ఆ ఇంట్లోకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని సామాన్లను పంపారు. కానీ వాటిని PWD సిబ్బంది బయటపడేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. 


ముఖ్యమంత్రి అధికార నివాసంలోకి ముఖ్యమంత్రిని వెళ్లనీయకపోవడం చర్చనీయాంశమయింది. ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరిగినా.. ముఖ్యమంత్రి ఉన్నా  ఆ రాష్ట్రానికి రాష్ట్ర హోదా లేదు. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు ఉంటాయి. కొన్నాళ్ల కిందట ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్  గవర్నర్ అనే అర్థంలో కేంద్రం చట్టం కూడా మార్చింది. ఈ ప్రకారం లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఆయనే కొత్త సీఎం .. అధికార నివాసంలోకి వెళ్లేందుకు అనుమతించలేదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదే్శాలతోనే pWD అధికారులు అతీషి వస్తువుల్ని బయట పడేశారని ఆరోపిస్తున్నారు. 


తనకు సీఎం క్యాంప్ ఆఫీసులోకి వెళ్లేందుకు అనుమతించకపోవడం తన ప్రైవేటు నివాసంలోనే ఫైళ్లు చూస్తూ అతిషీ కనిపించారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ సీఎంను ఇబ్బంది పెడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ ఇల్లు ఓ బీజేపీ నేతకు కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.  



అయితే బీజేపీ నేతలు మాత్రం కేజ్రీవాల్ ఇల్లు ఖాళీ చేసినప్పటికీ అధికారికంగా ఆ ఇంటి తాళాలను అధికారులకు స్వాధీనం చేయలేదని ఇంకా ఆ ఇల్లు వారి అధీనంలోనే ఉందని అంటున్నారు. అందులో చాలా రహస్యాలు ఉన్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ సీజ్ చేయించారని అంటున్నారు. 





మొత్తంగా ఢిల్లీలో ఆప్ వర్సెస్ బీజేపీ వివాదం ఇంటి వరకూ రావడం హాట్ టాపిక్ గా మారింది. కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఆ ఇంటికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టారని అత్యంత విలాసవంతమైన ఫర్నీచర్ కొనుగోలు చేశారని ఆరోపించారు.