Delhi Azadpur railway station platform colony:  దేశ రాజధాని ఢిల్లీలోని ఆజాద్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫామ్‌ను స్థానికులు ఇళ్లు, షాపులు నిర్మించుకుని కాలనీలా మార్చేసుకున్నారు.   30 సంవత్సరాలుగా  వీరు ఫ్లాట్ ఫామ్ పైనే ఉంటున్నారు. ఇప్పుడు మెట్రో విస్తరణలో భాగంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని అనుకుంటున్నారు.                                                       

Continues below advertisement

ఆజాద్‌పూర్ రైల్వే స్టేషన్ ఢిల్లీలోని ఉత్తర ప్రాంతంలో  ఉంది. ఈ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 1 ,  ట్రాక్‌ల సమీపంలో 400కి పైగా అక్రమ ఇళ్లు నిర్మించారు.  ఈ ప్రాంతంలో మండీలో పనిచేసే కూలీలు, కార్మికులు, వారి కుటుంబాలు నివసిస్తున్నారు.   ప్లాట్‌ఫామ్‌పై ఇళ్లు, షాపులు కనిపిస్తూనే ఉంటాయి.  రైల్వే ట్రాక్‌కు సమీపంలోనే ఈ ఇళ్లు ఉన్నాయి. ఈ ఆక్రమణలు 1990ల నుండి కొనసాగుతున్నాయి. స్థానికుల ప్రకారం, వీరు రోజువారీ కూలీలు.ఇక్కడ కూడా అద్దెల దందా ఉంది.  ఇళ్లు యజమానులు ఒక్కో రూమ్‌కు 2,000 నుండి 6,000 రూపాయల వరకు రెంట్ వసూల్ చేస్తున్నారు.  ఈ ప్రాంతం రైల్వే సిగ్నల్‌లు, లైటింగ్‌ను ప్రభావితం చేస్తోంది, దీనివల్ల రైల్వే ఆపరేషన్లకు అడ్డంకులు  వస్తున్నాయి.  

 సోషల్ మీడియాలో వైరల్ అయిన  వీడియోలలో ప్లాట్‌ఫామ్‌పై ఇళ్లు, షాపులు, కుటుంబాలు  గడిపేస్తున్నాయి.   "రైల్వే ప్లాట్‌ఫామ్ కాదు, ఓ పూర్తి కాలనీ" అంటూ  నెటిజన్లు స్పందిస్తున్నారు. ఢిల్లీలో అక్రమ ఆక్రమణలపై బీజేపీ ప్రభుత్వం బుల్‌డోజర్ డ్రైవ్ నడుపుతోంది. ఆజాద్‌పూర్‌లో కొంతమంది నివాసులకు నోటీసులు ఇచ్చారు, కానీ పూర్తి రిమూవల్ జరగలేదు. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు ఈ ఆక్రమణలు 30 ఏళ్లుగా కొనసాగుతున్నాయని, సురక్షిత పునరావాసం కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.     

ఢిల్లీ ప్రభుత్వం స్లమ్‌కు ఇల్లు పథకాన్ని ప్రస్తావిస్తోంది, కానీ నివాసులు "మేము పేదలం, ముందు పునర్వాసం ఇవ్వాలి" అంటున్నారు. రైల్వే అధికారులు ఈ ప్రాంతంలో సిగ్నల్‌లు, ట్రాక్ మెయింటెనెన్స్‌కు అడ్డంకులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.