Bundelkhand Expressway :  ప్రధానమంత్రి నరేంద్రమోడీ వారం రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. వెనుకబడిన ప్రాంతమైన బుందేల్ ఖండ్ నుంచి ఢిల్లీకి అనుసంధానం చేసే ఎక్స్ ప్రెస్‌ వేను ప్రారంభించారు. కేంద్ర నిధులతో నిర్మించిన ఈ రహదారి వల్ల బుందేల్ ఖండ్ జాతకం మారిపోతుందని బీజేపీ వర్గాలు చెప్పాయి. ఈరహదారి వీడియోలు కూడా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. 





అయితే వారం రోజుల తర్వాత  ఇప్పుడు ఆ రహదారి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ భిన్నమైన కారణంతో. భారీ వర్షాలు రావడంతో ఎక్స్ ప్రెస్‌ చాలా చోట్ల కొట్టుకుపోయింది. కొన్ని చోట్ల గొయ్యిలు పడిపోయాయి.దీంతో ఉపయోగించడానికి వీలు లేకుండా పోయింది. వేల కోట్లు పెట్టి నిర్మించిన ఈ రోడ్ దుస్థితి ఇప్పులు అయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.





పలు చోట్ల రహదారికి భారీ డ్యామేజీ చోటు చేసుకుంది. నెటిజన్లు ఫోటోలతో సహా ప్రదర్శిస్తున్నారు.





కొంత మంది బుందేల్ ఖండ్ రహదారిపై పడిన గోతుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి వెదుకుతున్నట్లుగా వేసిన కార్టూన్ ను వైరల్  చేస్తున్నారు.