Twitter New Policy:


ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్..


ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ కీలక ప్రకటన చేశాడు. త్వరోలనే ట్విటర్‌లో కొత్త పాలసీ తీసుకొస్తున్నట్టు వెల్లడించాడు. విద్వేషపూరిత ట్వీట్‌లను నియంత్రించడం సహా...ఇప్పటి వరకూ బ్యాన్ అయిన అకౌంట్‌ల గురించీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. "కొత్త పాలసీ ఫ్రీడమ్ ఆఫ్ రీచ్‌కి కాకుండా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి ప్రాధాన్యతనిస్తుంది. విద్వేషపూరిత ట్వీట్‌లను ఏ మాత్రం ఉపేక్షించం. ట్విటర్‌కు రిక్వెస్ట్ పెట్టుకుంటే తప్ప కొన్ని ట్వీట్‌లు ఎవరికీ కనిపించవు" అని వెల్లడించాడు. ఇక బ్లాక్ అయిన అకౌంట్‌లను పునరుద్ధరించే విషయాన్ని ప్రస్తావించాడు మస్క్. ఓ ముగ్గురి ప్రముఖల ట్విటర్ అకౌంట్‌లను పునరుద్ధరిస్తామని చెప్పిన మస్క్...ట్రంప్‌ అకౌంట్‌పై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. కమెడియన్ కాథీ గ్రిఫిన్‌ ఎలన్ మస్క్‌పై అప్పట్లో వ్యంగ్యంగా ట్వీట్‌లు చేశాడు. దీనిపై ఆగ్రహించిన ట్విటర్.. వెంటనే అతని అకౌంట్‌ని బ్లాక్ చేసింది. 










కీలక పరిణామాలు..


ట్విట్టర్‌ చీఫ్ ఎలాన్ మస్క్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ట్విట్టర్‌ సంస్థ నుంచి వందల మంది ఉద్యోగులు రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. టెస్లా తరహా వర్కింగ్ స్టైల్‌ను ట్విట్టర్‌లో ప్రవేశపెట్టిన మస్క్.. ఉద్యోగులు ఎక్కవ సమయం పని చేయాలని లేదా సంస్థను వీడాలని అల్టిమేటం ఇచ్చారు. దీంతో ఉద్యోగులు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. అల్టిమేటమ్‌కు కట్టుబడి ఉండని ఏ ఉద్యోగికైనా మూడు నెలల సెవెరెన్స్ (ఉద్యోగం నుంచి తీసెసే నోటీసు) అందుతుందని మస్క్ ఉద్యోగులకు మెయిల్ చేసినట్లు CNN న్యూస్ తెలిపింది. ట్విటర్ బ్లూ టిక్‌పై సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో చర్చ జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. బ్లూటిక్ మెయింటేన్ చేయాలంటే తప్పనిసరిగా నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని కండీషన్ పెట్టాడు ఎలన్ మస్క్. అయితే...కొందరు హ్యాకర్లు ఫేక్ అకౌంట్లు సృష్టించి ట్విటర్‌కు తలనొప్పి తెచ్చి పెట్టారు. పైగా వాటికి బ్లూటిక్‌ కూడా ఉన్నట్టు క్రియేట్ చేశారు. అమెరికాలో అయితే...ఫేక్ అకౌంట్‌లు క్రియేట్ చేసిన వాళ్లు కూడా బ్లూ టిక్‌ కోసం 8 డాలర్లు చెల్లించారు. ఆ తరవాత కానీ..అవి నకిలీ అని తేలలేదు. మొత్తానికి ఇది మస్క్‌ను ఇరకాటంలో పడేసింది. ఈ పెయిడ్ ఫీచర్ ఉంచుదామా తీసేద్దామా అనే ఆలోచనలో పడి..చివరకు కొద్ది రోజుల పాటు ఈ సర్వీస్‌ను నిలిపివేశారు. ఫేక్ అకౌంట్‌ల లెక్క తేల్చిన మస్క్ మామ...ఆ పని పూర్తి చేసిన వెంటనే ఓ ప్రకటన చేశాడు. ట్విటర్ బ్లూటిక్ పెయిడ్ ఫీచర్‌ను రీస్టార్ట్ చేస్తున్నట్టు వెల్లడించాడు. ఇదే విషయాన్ని 
ట్వీట్‌ చేశాడు. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ సర్వీస్‌ను మళ్లీ ప్రారంభిస్తామని చెప్పాడు. 


Also Read: Sandalwood Policy 2022: అక్కడి రైతులు ఎర్రచందనం సాగు చేయొచ్చు, ఓపెన్‌గా అమ్ముకోవచ్చు కూడా