Drugs Smuggling: డ్రగ్స్‌ని స్మగ్లింగ్ చేసేందుకు కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నాయి ముఠాలు. ఎప్పటికప్పుడు అధికారులు వీటి సరఫరాని అడ్డుకుంటున్నా ఎక్కడో ఓ చోట గుట్టు చప్పుడు కాకుండా సప్లై అవుతున్నాయి. ఈ క్రమంలోనే కస్టమ్స్ అధికారులకే షాక్ ఇచ్చే ఘటన జరిగింది. అహ్మదాబాద్‌లో పిల్లలు ఆడుకునే బొమ్మల్లో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ని దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు నిందితులు. బొమ్మల్లోనే కాదు. లంచ్ బాక్స్‌లు, చాక్లెట్లు, క్యాండీ విటమిన్స్‌లో డ్రగ్స్‌ని దాచి పెట్టారు. ఇప్పటికే ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, కస్టమ్స్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్‌ని సీజ్ చేశారు. కెనడా, అమెరికా, థాయ్‌లాండ్ నుంచి వచ్చిన marijuana ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్యాక్‌లలో సింథటిక్, హైబ్రిడ్ గాంజా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Ahmedabad: పిల్లల బొమ్మలు లంచ్‌బాక్స్‌లో రూ.కోటి విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్, సీజ్ చేసిన అధికారులు
Ram Manohar
Updated at:
01 Jun 2024 03:03 PM (IST)
Ahmedabad News: అహ్మదాబాద్‌లో పిల్లల బొమ్మలు, లంచ్ బాక్స్‌లో డ్రగ్స్ తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అహ్మదాబాద్‌లో పిల్లల బొమ్మలు, లంచ్ బాక్స్‌లో డ్రగ్స్ తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
NEXT
PREV
Published at:
01 Jun 2024 03:03 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -