Tips to avoid electrical accidents | హైదరాబాద్: అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే భారీ వర్షాల సమయంలో, విద్యుత్ ప్రమాదాలు అధికంగా జరుగుతుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాలు, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ (Electric Shock)ల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యుత్ తీగల్ని అసలే తాకవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవీ.
విద్యుత్ అత్యవసర పరిస్థితి సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేయండి.
1. వర్షాలు కురుస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ స్తంబాలను ముట్టుకోరాదు.
2. కరెంటు వైర్ లైన్ క్రింద నిల్చోవడం, నడవటం, సెల్ ఫోన్ మాట్లాడటం అసలు చేయకూడదు.
3. విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను సైతం మీరు ముట్టుకోకూడదు, విషయం సంబంధిత అధికారులకు తెలపాలి
4. తడి చేతులతో ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను, ఎఫ్ఎం రేడియోను, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులను ముట్టుకోరాదు.
5. ఇంటి పైకెక్కి కరెంటు తీగల సమీపానికి వెళ్లవద్దు. దుస్తువులను తీగలపై ఆరవేయరాదు
6. గాలికి ఎగిరి తీగలపై పడిన చెట్లకొమ్మలను, దుస్తులను కర్రలతో, లోహరాడ్లతో కాని తీయవద్దు. వెంటనే విద్యుత్ సిబ్బందికి విషయం తెలియ చేయండి
7. చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.
8. ఉతికిన బట్టలను ఇనుప తీగలపై వేయకూడదు.
9. తెగిపడి వున్న విద్యుత్ తీగల, వైర్ల సమీపానికి వెళ్లకూడదు, వాటిని ముట్టుకోరాదు. సంబందించిన అధికార్లకు తెలియచేయాలి.
10. ఇంట్లో ఉన్న వాటర్ హీటర్, రైస్ కుక్కర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతే ముట్టుకోవాలి
11. ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు "డిష్ " కనెక్షన్ తీసివేయడం బెటర్
12. ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైన డ్యామేజ్ అయినచో సంబంధించిన అధికారి దృష్టికి తీసుకెల్లాలి.
13. ప్రతి కరెంటు వస్తువుకు "ఎర్త్ వైర్" తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే విద్యుత్ ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది
14. బావుల వద్ద తడిసిన చేతితో స్టార్టరును తాకవద్దు అని రైతులకు సూచన
15. గాలి వల్ల విద్యుత్ లైను తీగలు తెగిపడటం, పోల్లు పడి పోయే అవకాశం వుంటుంది. సంబందిత అధికారులకు తెలియ చేయాలి. అటువైపు వెల్లడం కానీ, పశువులను మేపడం కోసం కానీ పంపవద్దు
16. విద్యుత్ లైన్ల మీద చెట్ల కొమ్మలు పడినా, గాలికి ఎగిరి వచ్చిన దుస్తులు, ప్లాస్టిక్ కవర్లు, ఫ్లెక్సీలు పడితే, పెద్ద శబ్దంతో కరెంటు పోయినా, నిప్పు రవ్వలు వస్తున్నా, సంబంధిత అధికారులకు తెలియచేస్తే, కరెంటు పునరుద్ధరణ సులభం అవుతుందని.. నిపుణులు చెరుకుపల్లి శ్రీనివాసులు (బీటెక్, ఈఈఈ) ఈ జాగ్రత్తల్ని సూచించారు.
Also Read: Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో 6, తెలంగాణలో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్