Mohanlal Breaks Silence On Hema Committee Report: జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళీ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. పలువురు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో  అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌(AMMA) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నటుడు మోహన్‌ లాల్‌ ఎట్టకేలకు జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై స్పందించారు. హేమ కమిటీ నివేదికను స్వాగతించిన ఆయన.. వేలాది మంది పని చేసే మలయాళీ ఇండస్ట్రీని నాశనం చేయకూడదని విజ్ఞప్తి చేశారు.  


కేరళ క్రికెట్ లీగ్ ఈవెంట్ లో భాగంగా తిరువనంతపురంలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “జస్టిస్ హేమ కమిటీ రిపోర్టులో చెప్పినట్లు తాను ఏ పవర్ గ్రూప్ లో భాగం కాదు. నాకు ఏ పవర్ గ్రూప్ గురించి తెలియదు. నేను ఎక్కడా దాక్కోలేదు. వ్యక్తిగత పనులు, షూటింగ్‌లలో భాగంగా గుజరాత్, ముంబై, చెన్నైలలో పర్యటిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల కారణంగా మలయాళ చిత్ర పరిశ్రమ కకావికలం కావడం బాధాకరం” అన్నారు.  


‘అమ్మ’ మాత్రమే కాదు అందరూ బాధ్యులే  


అటు హేమ కమిటీ నివేదికను స్వాగతించిన మోహన్ లాల్.. నటుడిగా, నిర్మాతగా తాను కూడా ఆ కమిటీ ముందున్నానని చెప్పారు. అయితే, హేమ కమిటీ నివేదికను తాను ఇంకా చూడలేదని చెప్పారు. మలయాళీ ఇండస్ట్రీలో వేలాది మంది పని చేసే అతి పెద్ద సినీ పరిశ్రమ. ఇండస్ట్రీలో తలెత్తిన సమస్యలను ‘అమ్మ’ పరిష్కరించలేకపోయింది. నటుల కోసం స్వచ్ఛంద సంస్థలో భాగంగా ఏర్పడిన ట్రేడ్ యూనియన్ ‘అమ్మ’. ఈ సందర్భ ప్రతిసారీ విమర్శలకు గురవుతోంది. ఇండస్ట్రీలో తలెత్తే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన సంఘం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ బాధ్యులే. మలయాళ సినీ పరిశ్రమలో 21కి పైగా సంఘాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించి బాధ్యత వహించాలి. లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఉంది. నేను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేను. దయచేసి ఇండస్ట్రీ నాశనం చేయవద్దని కోరుతున్నాను’’ అన్నారు.






తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే


‘అమ్మ’లోని కొంతమంది సభ్యుల మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మోహన్ లాల్ స్పదించారు. తప్పు చేసిన వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉంటే కచ్చితంగా శిక్షించాల్సిందేనన్నారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించనన్నారు. హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఆయన అభినందించారు. ఇకపై ఇండస్ట్రీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.    


 2017 నటి భావనపై దాడి కేసు తర్వాత కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. సుమారు 7 సంవత్సరాల తర్వాత కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు సమర్పించింది. ఈ నివేదికలో మహిళా నటులు ఎదుర్కొంటున్న సుమారు 17 రకాల ఇబ్బందులు వెల్లడించింది. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులను    మరియు దాని నివేదిక మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు మరియు దోపిడీకి సంబంధించిన ఉదంతాలను వెల్లడించింది.


Read Also: ఇన్నాళ్లకు అమ్మ కల నిజం చేశా- పుట్టిన రోజుకు ముందే నెరవేర్చడంతో సంతోషంగా ఉందన్న ఎన్టీఆర్