Modi Speech In Sydney : భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని ప్రజలుకోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. మూడు రోజుల పర్యటనకు ఆస్ట్రేలియా వచ్చిన ఆయన  సిడ్నీలో భారతీయులను ఉద్దేశించి స్ఫూర్తి దాయకంగా ప్రసంగించారు.  వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనదన్నారు. పాల ఉత్పత్తిలోనే భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఉందని మోదీ గుర్తు చేశారు. నైపుణ్యానికి భారత్‌లో కొదువలేదన్నారు. ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. మొబైల్ తయారీలోనూ భారత్ ది రెండో స్థానం అన్నారు. అనేక వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ భారత్ రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. భారత్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రపంచం అంతా ప్రశంసిస్తోద్నారు. భారత్ లోని ఫిన్ టెక్ విప్లవాన్ని ప్రపంచం మొత్తం చూస్తోందని మోదీ గుర్తు చేశారు.  గడచిన 9ఏళ్లలో మిలియన్ల కొద్ది బ్యాంకు ఖాతాలను తెరిచామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేశామని ప్రవాస భారతీయులకు గుర్తు చేశారు.భారత్‌లో ఫిన్ టెక్ విప్లవం వల్ల డైరక్ట్ బెనిఫిట్స్ ట్సాన్స్ ఫర్ సాధ్యమయిందన్నారు.


 





 


 2014లో తాను సడ్నీ వచ్చినప్పుడు ఓ  భారత ప్రధాని కోసం మీరు 28 ఏళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదని వాగ్దానం చేశానన్నారు. దానికి తగ్గట్లాగనే  ఇక్కడ తాను మరోసారి సిడ్నీలో ఉన్నాను అని అని ప్రధాన మంత్రిగుర్తు చేసుకున్నారు.  సమీర్ పాండేను పర్రమట్ట లార్డ్ మేయర్ గా ఎన్నుకున్న విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు.హారిస్ పార్క్ పేరును లిటిల్ ఇండియాగా మార్చినందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. 


ఒకప్పుడు భారత్-ఆస్ట్రేలియా సంబంధాలను కామన్వెల్త్, క్రికెట్, కర్రీ అనే 3సీ ద్వారా నిర్వచించామని మోదీ గుర్తు చేశారు. ఆ తర్వాత కొందరు దీనిని 3డీ- డెమోక్రసీ, డయాస్పోరా లేదా దోస్తీ అని నిర్వచించారని చెప్పారు. ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్ అనే 3ఈ తో సంబంధం ఉందని కొందరు అంటున్నారు. కేవలం దౌత్య సంబంధాల కారణంగానే భారత్, ఆస్ట్రేలియాల మధ్య పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం అభివృద్ధి చెందలేదని .. అసలు కారణం, నిజమైన శక్తి - ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులందరూ" అని మోదీ వ్యాఖ్యానించినప్పుడు ఆడిటోరియం చప్పట్లదో దద్దరిల్లిపోయింది. 


మన జీవన శైలి భిన్నంగా ఉండవచ్చునని, కానీ ఇప్పుడు యోగా కూడా మనల్ని కలుపుతోందని ప్రధాని అన్నారు. క్రికెట్ కారణంగా  చాలా కాలంగా కనెక్ట్ అయ్యాం. కానీ ఇప్పుడు టెన్నిస్, సినిమాలు కూడా మనల్ని కనెక్ట్ చేస్తున్నాయి. మేము వివిధ పద్ధతుల్లో ఆహారాన్ని తయారు చేయవచ్చు, కానీ మాస్టర్ చెఫ్ ఇప్పుడు మమ్మల్ని కలుపుతోందని టీవీ కార్యక్రమం గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. 


ఒకటే భూమి.. ఒకటే ఆరోగ్యం నినాదంతో ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత భారతదేశానిదే అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మే 22వ తేదీ మంగళవారం ఆస్ట్రేలియా దేశంలోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు మోడీ. ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా..భారతదేశం స్పందిస్తుందన్నారాయన. కరోనా సమయంలో ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ ఇండియాలోనే జరిగిందని స్పష్టం చేశారు ప్రధాని మోడీ. పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని.. అందులో భాగంగానే సౌర విద్యుత్ తయారీ, వినియోగాన్ని ప్రోత్సహిస్తూ.. పర్యావరణాన్ని రక్షిస్తుందని వెల్లడించారాయన. భారత్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా మార్చటం.. తన లక్ష్యం, కలగా  ప్రవాస భారతీయులకు వివరించారు.