New Variants in India:


భారత్‌లో 11 ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్‌లు వెలుగులోకి వచ్చాయి. విదేశీ ప్రయాణికులను పరీక్షించగా ఇది వెల్లడైంది. డిసెంబర్ 24 నుంచి జనవరి 3వ తేదీ మధ్య కాలంలో టెస్ట్‌లు చేయగా...ఈ వేరియంట్‌లను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ పదిరోజుల్లో మొత్తం 19,277 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 124 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ శాంపిల్స్‌లో 40 నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్ చేశారు. వీటిలో 14 శాంపిల్స్‌లో XBB వేరియంట్‌ కనిపించింది. మిగతా కొన్ని నమూనాల్లో  XBB.1, BF.7 వేరియంట్‌లనూ గుర్తించారు. ఈ ఫలితాలు రాకముందు రోజు ఐదుగురు XBB.1.5 వేరియంట్ బారిన పడ్డారు. ఈ వేరియంట్ కారణంగానే...అమెరికాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు భారత్‌లోనూ ఈ వేరియంట్ వెలుగులోకి రావడం కలవర పెడుతోంది. ఈ ఐదుగురిలో ముగ్గురు గుజరాత్‌కు చెందిన వాళ్లే. రాజస్థాన్‌లో ఒకరికి, కర్ణాటకలో ఒకరికి ఇదే వేరియంట్‌ సోకింది.