దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. గత కొంత కాలంగా భారీగా తగ్గిన కేసులు ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో రోజువారిగా నమోదయ్యే కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసులు కాస్త తగ్గాయి. కరోనా మహమ్మారితో నిన్న 219 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,10,649 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 53,14,68,867 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
8.9 శాతం తగ్గిన కేసులు
నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత కొన్ని రోజులుగా 40 వేల పైగా నమోదవుతున్న కరోనా కేసులు తాజాగా 40 వేల దిగువకు వచ్చాయి. అటు మరణాల్లోనూ భారీ తగ్గుదల కన్పించింది. 24 గంటల వ్యవధిలో 38,948 కొత్త కేసులు నమోదవ్వగా..219 మంది చనిపోయారు. ఆదివారంతో పోలిస్తే 8.9 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి.
Also Read: America: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం…వ్యక్తిగత కక్షలే అని అనుమానిస్తున్న పోలీసులు
వేగంగా వ్యాక్సినేషన్
కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ మొత్తం 3.30 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 4,40,752 మంది వైరస్ కారణగా మరణించారు. ఇదిలా ఉండగా చాలా రోజుల తర్వాత కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో 43,903 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.44 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 4,04,874 మంది వైరస్‌తో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల కేసుల రేటు 1.23 శాతంగా ఉంది. ఆదివారం 25.23 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 68.75 కోట్ల డోసులను కేంద్రం పంపిణీ చేసింది.
కేరళలో కరోనా ఉద్ధృతి
కేరళ కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గినా... కేరళలో మాత్రం కట్డడి కాలేదు. ఆదివారం ఇక్కడ 26,701 కేసులు నమోదయ్యాయి. 74 మంది కరోనాతో మరణించినట్లు కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజాగా కేరళలో మళ్లీ నిఫా వైరస్ కూడా కలకలం రేపుతుంది.
Also Read: YCP Attack: దాడులకు భయపడేది లేదు ...నేనే స్వయంగా రోడ్లపైకి వస్తా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్