Viral News in Telugu: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఇవాళ (ఆగస్టు 21) భారత్ బంద్‌కి పిలుపునిచ్చాయి పలు సంఘాలు. Reservation Bachao Sangharsh Samiti ఆధ్వర్యంలో ఈ బంద్ జరుగుతోంది. ఈ నిరసనల్లో భాగంగా బిహార్, ఝార్ఖండ్, యూపీ, రాజస్థాన్‌లో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీగా మొహరించి నిరసనకారులను చెదరగొడుతున్నారు. లాఠీఛార్జీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పట్నాలో ఓ పోలీస్ ఆఫీసర్ చేసిన పని సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. నిరసనకారులపై లాఠీఛార్జ్ చేస్తూ పొరపాటున ఓ అధికారికీ ఓ దెబ్బ వేశాడు. ఆ వెంటనే పొరపాటు గ్రహించి సారీ సర్ సారీ సర్ అని బతిమాలాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్నాలోని దాక్ బంగ్లా వద్ద ఈ ఘటన జరిగింది.
భారత్ బంద్‌కి మద్దతునిస్తూ పట్నాలో నిరసనలు చేపట్టారు. బిహార్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు కొనసాగాయి. రోడ్లపై బైఠాయించడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌లపైనా ధర్నా చేశారు నిరసనకారులు. దర్బంగా రైల్వే స్టేషన్ వద్ద దర్బంగా-న్యూ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ని అడ్డుకున్నారు. భీమ్ ఆర్మీ సభ్యులు బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. ట్రైన్ ఇంజిన్‌పైకి ఎక్కి నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకించారు. ఇదంతా కుట్ర అని మండిపడ్డారు. ఇక పట్నాలో స్కూల్స్ బంద్ చేశారు. బస్ సర్వీస్‌లు నిలిచిపోయాయి. ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది.
Also Read: Bharat Bandh: ఇవాళ భారత్ బంద్ ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా ఎఫెక్ట్!