Conversion is found illegal couple cannot be recognised as married: అక్రమ  మత మార్పిడి ఆధారంగా జరిగిన వివాహం చట్టబద్ధంగా గుర్తించలేమని, ఆ జంటను చట్టపరంగా భార్యాభర్తలుగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ముస్లిం చట్టం ప్రకారం వివాహం అదే మతస్తుల మధ్య ఒప్పందంగా జరగాలని, మత మార్పిడి అక్రమమైతే ఆ వివాహం ఆటోమేటిక్‌గా రద్దు అవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పు మొహమ్మద్ బిన్ కాసిం  అలియాస్ అక్బర్) , జైనబ్ పర్వీన్ అలియాస్ చంద్రకాంత అనే జంట వివాహ వివాదంలో భాగంగా వచ్చింది. 

Continues below advertisement

మత మార్పిడి సర్టిఫికెట్‌లో లోపాలు ఉన్నట్లుగా గుర్తించిన  జంటకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ (SMA)లో వివాహం రిజిస్టర్ చేయాలని ఆదేశించింది. ఆ రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు చంద్రకాంతను ప్రయాగ్రాజ్‌లోని మహిళల సురక్షిత గృహంలో ఉంచాలని ఆదేసించింది. ఈ తీర్పు యూపీలోని అక్రమ మతమార్పిడ్ చట్టాన్ని మరింత బలపరుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొహమ్మద్ బిన్,  చంద్రకాంత అనే దంపతులు పెళ్లి చేసుకున్నారు. తమ వివాహ జీవితానికి వీరు రక్షణ కోరారు.  2025 ఫిబ్రవరి 22న చంద్రకాంత ఇస్లాం మతాన్ని స్వీకరించిందని..  ఖాన్‌ఖా అలియా అరిఫియా సంస్థ నుంచి మత మార్పిడి సర్టిఫికెట్ పొందిందని కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత, మే 26న ముస్లిం  సంప్రదాయం ప్రకారం మొహమ్మద్ బిన్ ను వివాహం చేసుకుంది.  స్థానిక ఖాజీ నుంచి మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకున్నారు.  మత మార్పిడి సర్టిఫికెట్ చెల్లదని ప్రభుత్వం తరపు లాయర్ వాదించారు. అదే సమయంలో ఖాన్‌ఖా అలియా అరిఫియా సెక్రటరీ మరియు మేనేజర్ సైయద్ సరావన్ (కౌశాంబి) తమ సంస్థ ఫిబ్రవరి 22న ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు.   ఫేక్ డాక్యుమెంట్‌పై అక్రమ మతమార్పిడి గుర్తించబోమని హైకోర్టు స్పష్టం చేసింది.  ముస్లిం చట్టం ప్రకారం వివాహం అదే మతస్థుల మధ్య ఒప్పందం  అని స్పష్టం చేశారు.  చంద్రకాంత  మత మార్పిడి చెల్లకపోతే  జంటను చట్టపరంగా భార్యాభర్తలుగా గుర్తించలేమని  ఈ వివాహం చట్టబద్ధం కాదని, రద్దు అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే, జంటకు కోర్టు మరో మార్గం చూపించింది – స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ (1954)లో వివాహం రిజిస్టర్ చేయాలని ఆదేశించింది. ఈ చట్టం మత మార్పిడి లేకుండా ఇంటర్‌ఫెయిత్ మ్యారేజ్‌లకు అవకాశం ఇస్తుందని కోర్టు వివరించింది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు చంద్రకాంతను ప్రయాగ రాజ్ మహిళల సురక్షిత గృహంలో ఉంచాలని ఆదేశించారు. తన తల్లిదండ్రులతో ఉండబోనని ఆ మహిళ కోర్టుకు చెప్పారు.                      

నాలుగేళ్ల కిందట  ఉత్తర ప్రదేశ్ లో అక్రమ మతమార్పిడ్ నిరోధక చట్టాన్ని తీసుకు వచ్చారు.  ఈ చట్టం 'లవ్ జిహాద్' ఆరోపణలతో మతమార్పిడ్‌లను నియంత్రిస్తుంది.                                   

Continues below advertisement