Telangana Election Committee Chairman: తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ నియమించింది. దేశ వ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికలు మూడు నెలల్లో జరగనుండడంతో కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలకు ఎన్నికల కమిటీలను నియమించింది. ఇందులో భాగంగా టీపీసీసీ ఎన్నికల కమిటీలో మొత్తం 25 మందికి చోటు దక్కింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డి. శ్రీధర్ బాబు, సీతక్క, దామోదర రాజనర్సింహ, సీనియర్ నేతలు జానారెడ్డి, వి. హనుమంతరావు, మధుయాష్కీ గౌడ్, సంపత్ కుమార్, రేణుకా చౌదరి, బలరామ్ నాయక్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజహరుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేశ్వర్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, ప్రేమ్‌సాగర్ రావు, పొదెం వీరయ్య, సునీతారావుతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్ స్టేట్ ప్రెసిడెంట్‌లకు అధ్యక్షులకు అవకాశం కల్పించింది.
Revanth Reddy: కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా రేవంత్ నియామకం, మరో 25 మందికి చోటు
ABP Desam
Updated at:
07 Jan 2024 07:52 AM (IST)
Telangana Congress: లోక్ సభ ఎన్నికలు మూడు నెలల్లో జరగనుండడంతో కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలకు ఎన్నికల కమిటీలను నియమించారు.
రేవంత్ రెడ్డి