Rohit Sharma: కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత షామా మహమ్మద్ టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కు పాల్పడటం వివాదాస్పదం అవుతోంది. రోహిత్ ను లావుగా ఉంటాడు.. చెత్త కెప్టెన్ అని అభివర్ణించింది. అతని కెప్టెన్సీ వర్కవుట్ కాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. నెటిజన్లు తీవ్ర విమర్శలు చేయడంతో షామా మహమ్మద్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ ను తొలగించారు.
షామా మహమ్మద్ చేసిన ట్వీట్ పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ ఫిట్‌నెస్, కెప్టెన్సీకి మద్దతుగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది రోహిత్ ఫిట్‌నెస్ పై కూడా కొంత మంది ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే మీడియాతో మాట్లాడుతూ .. షామా మహమ్మద్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. తన ట్వీట్ డిలీ చేసినా.. అదే మాటలు చెబుతున్నారు.
ఈ వివాదంలోకి రాజకీయాలు కూడా వచ్చి చొరబడ్డాయి. టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ షామా మహమ్మద్ వ్యాఖ్యలను సమర్థించారు. రోహిత్ శర్మ ఫిట్ గా ఉండాలన్నారు.
కొంత మంది ఈ వివాదాన్ని రాహుల్ గాంధీకి ముడిపెట్టి విమర్శలు చేస్తున్నారు.
సద్విమర్శలు చేయవచ్చు కానీ బాడీ షేమింగ్ కు పాల్పడటం మంచిది కాదని పలువురు సూచిస్తున్నారు. టీమిండియా వరుస విజయాలు సాధిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజకీయ నతలు వారి ఏకాగ్రతను దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియా షామా వర్సెస్ శర్మ అంశంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.