Civil Mock Drill:  సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితులు, ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేయడానికి రెడీ అవుతున్న సమయంలో.. దేశ ప్రజలందరిలో యుద్ధ సన్నద్ధత ఉండేలా చూసేందుకు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు.  ఈ సివిల్ మాక్ డ్రిల్ ఏర్పాట్లపై   కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ మంగళవారం అన్ని రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాల (UTలు) ప్రధాన కార్యదర్శులతో కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు.  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA)  అన్ని రాష్ట్రాలు మరియు UTలు మే 7న సమన్వయంతో కూడిన సివిల్ మాక్ డ్రిల్   నిర్వహించాలని  ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసి చేసిదంి.  భారతదేశంలోని 244 జిల్లాల్లో ఈ డ్రిల్స్ జరుగుతాయి.  వీటిలో చాలా వరకు యుద్ధ సమయ పరిస్థితులతో సహా వివిధ ముప్పులకు గురయ్యే  పరిస్థితుల్లో ఎలా బయట పడాలో ప్రాక్టీస్ చేస్తారు.  

 శత్రు దాడులు లేదా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు  సంసిద్ధతను అంచనా వేయడం, మెరుగుపరచడం ఈ సివిల్ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం.  ఈ మాక్ డ్రిల్ యుద్ధం లాంటి పరిస్థితిని కృత్రిమంగా సృష్టిస్తుంది.  సైరన్‌ల మోత, స్థానిక అత్యవసర సేవలు,  సమన్వయంతో  స్పందించడం వంటివి  ఉంటాయి.  రతికూల వాతావరణంలో తలెత్తే ఆకస్మిక పరిస్థితులకు దేశాన్ని మరియు దాని పరిపాలనా చట్రాన్ని సిద్ధం చేయడమే  ఈ సివిల్ మాక్ డ్రిల్ ఆలోచన. ఈ తరహా మాక్ డ్రిల్ దేశంలో నిర్వహించడం చాలా కాలం తర్వాత ఇదే మొదటి సారి. 1971లో చివరి సారిగా నిర్వహించారు.  1999 కార్గిల్ యుద్ధం సమయంలో కూడా అలాంటి జాతీయ స్థాయి పౌర రక్షణ డ్రిల్స్ నిర్వహించలేదు.          

ఈ మాక్ డ్రిల్స్ లో ప్రజాసహకారం ముఅకయం.  రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు, ఆరోగ్య విభాగాలు, స్థానిక పోలీసులు మరియు జిల్లా పరిపాలనలు అన్నీ ఈ కసరత్తులో పాల్గొంటాయి. బీజేపీ కార్యక్తలందరూ పాలు పంచుకోవాలని బీజేపీ పిలుపునిచ్చింది. మే 7న  సివిల్ ాక్ డ్రిల్ జరుగుతుంది.  ఎయిర్ సైరన్స్ ఉంటాయని  పౌరులను భయపడవద్దని కోరుతున్నారు.  గ్రామ స్థాయి వరకు ఈ కసరత్తు చేరేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరాల్లో సంపూర్ణంగా విద్యుత్‌ నిలిచిపోతుందని ఇదంతా ప్రాక్టీస్ లో భాగమని చెబుతున్నారు.