Bank Holidays : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సీజన్ నడుస్తోంది. పండుగ సమీపిస్తున్నందున ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని చర్చిలను లైట్లతో అందంగా అలంకరించారు. అయితే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ముందుగానే ప్రకటించిన 2024 విద్యాసంస్థరం క్యాలెండ్ ప్రకారం స్కూల్‌లో క్రిస్మస్ పండుగకు రెండు రోజులు హాలిడేస్ ఇచ్చారు. డిసెంబర్ 25, 26న విద్యాసంస్థలు, గవర్నమెంట్ ఆఫీసులకు హాలిడేస్ ఉంటాయని ప్రకటించారు. మంగళవారం ఆప్షనల్ హాలీడేగా ఉంచారు. అంటే ఆరోజు సెలవు ఇస్తే వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉంటాయి. 


ఆంధ్రప్రదేశ్‌లో కూడా 25వ తేదీని పబ్లిక్ హాలిడేగా పేర్కొన్నారు. డిసెంబర్‌ 24, 26 తేదీలను ఆప్షనల్ హాలిడేగా తేల్చారు. ఈ మూడు రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంది. మరోవైపు మిషనరీ స్కూల్స్ మాత్రం 24వ తేదీ నుంచి జనవరి రెండో తేదీ వరకు సెలవులు ప్రకటించాయి.


ముఖ్యంగా బ్యాంకులకు. డిసెంబర్ 25న బ్యాంకులకు సెలవనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 24న  కూడా బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదంటే ఆ రోజు కూడా సెలవేనా అని చాలా మంది సందేహిస్తున్నారు. ఆ విషయానికొస్తే కేవలం కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు మాత్రమే డిసెంబర్ 24న సెలవు ఉన్నట్టు తెలుస్తోంది. 


క్రిస్మస్ సందర్భంగా బ్యాంకులకు సెలవులు


డిసెంబర్ 24 : 


షిల్లాంగ్ (మేఘాలయ)
కొహిమా (నాగాలాండ్)
ఐజ్వాల్ (మిజోరం)


డిసెంబర్ 25 : 


గ్యాంగ్ టక్ (సిక్కిం), పాట్నా (బీహార్), పాట్నా (బీహార్), పాట్నా (బీహార్), పాట్నా (బీహార్), పాట్నా (బీహార్), ఇటానగర్(అరుణాచల్ ప్రదేశ్), హైదరాబాద్, (తెలంగాణ), అమరావతి ఆంధ్రప్రదేశ్), గౌహతి (అస్సాం), అహ్మదాబాద్ (గుజరాత్), అగర్తల (త్రిపుర),  శ్రీనగర్ (జమ్మూ, కాశ్మీర్), తిరువనంతపురం (కేరళ), బేలాపూర్ (మహారాష్ట్ర),  సిమ్లా (హిమాచల్ ప్రదేశ్), భోపాల్ (మధ్యప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), చండీగఢ్, చెన్నై (తమిళనాడు), జైపూర్ (రాజస్థాన్), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్), ముంబై (మహారాష్ట్ర),  న్యూఢిల్లీ, పనాజీ (గోవా), నాగ్‌పూర్ (మహారాష్ట్ర), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), కొచ్చి (కేరళ),
 
డిసెంబర్ 26: 


కొహిమా (నాగాలాండ్), షిల్లాంగ్ (మేఘాలయ), ఐజ్వాల్ (మిజోరం)


డిసెంబర్ 27: 


కోహిమా (నాగాలాండ్) 


డిసెంబర్ 30 : 


స్వాతంత్ర్య సమరయోధుడు యు కియాంగ్ నంగ్‌బా వర్ధంతి సందర్భంగా షిల్లాంగ్ (మేఘాలయ)లోని బ్యాంకులు మూతపడతాయి. 


డిసెంబర్ 31 : 


నూతన సంవత్సర పండుగ/లాసాంగ్/నామ్‌సూంగ్ కారణంగా ఐజ్వాల్ (మిజోరం), గాంగ్‌టక్ (సిక్కిం)లో బ్యాంకులకు హాలిడే. 


సాధారణంగా బ్యాంకులు నెలలో మొదటి, మూడవ శనివారాలు, ఐదవ శనివారం తెరిచి ఉంటాయి. 2024లో చివరి శనివారం నాల్గవ శనివారం. అంటే డిసెంబర్ 28న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.



తెలుగు రాష్ట్రాల్లో సెలవులు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారాలు, రెండో, నాలుగో శనివారం బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. ఇక డిసెంబర్ నెలలో 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుందన్న విషయం తెలిసిందే. మిగిలిన అన్నిరోజులు బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయని ఆర్బీఐ ముందే వెల్లడించింది. డిసెంబర్‌లో మొత్తం 17 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నట్టు తెలిపింది. బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు కొనసాగుతాయని చెప్పింది. 
 
Also Read : హోమ్‌ లోన్‌ మీరు తీసుకోండి, గ్యారెంటీ గవర్నమెంట్‌ ఇస్తుంది - ఆస్తి పేపర్ల తనఖా అక్కర్లేదు!