Chaos at the Shamshabad airport : మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏర్పడిన సమస్య వల్ల శంషాబాద్ ఎయిర్ పోర్టులోనూ గందరగోళం ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఇప్పటివరకు 35 విమానాలు రద్దు చేసినట్లుగా ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. ఎయిర్‌పోర్టులో డిస్‌ప్లే బోర్డులు కూడా పని చేయడం లేదు. మాన్యువల్ బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు .. అతి కష్టం మీద మాన్యువల్ గా కొన్ని పనులు చక్క బెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొన్ని విమాన సర్వీసులు రద్దు చేయకుండా ఉండటానికి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బోర్డింగ్ పాసులను చేతితో రాసి ఇస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ ప్రకటించింది.
తప్పని సరి పరిస్థితుల్లోనే కొన్ని విమానాలను రద్దు చేస్తున్నారు. మాన్యూవల్ గా ఆపరేట్ చేసి.. రన్ చేయగలిగిన విమానాలను నడుపుతున్నారు ఆన్ లైన్ సేవలకు అంతరాయం ఏర్పడినందున ప్రయాణికులు వీలైనంత త్వరగా ఏయిర్ పోర్ట్ కు చేరుకుని చెక్ ఇన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే బయులేరే ముందు విమానం రద్దయిందో లేదో చూసుకోవాలని .. ఎయిర్ లైన్స్ సంస్థలను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇండిగో, ఆకాసా ఎయిర్, స్పైస్‌జెట్ వంటి పలు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు కొన్ని సూచనలు చేశాయి. మైక్రోసాఫ్ట్ లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా నెట్‌వర్క్ అంతటా తమ సేవలు ప్రభావితమయ్యాయని గా ఆన్ లైన్ బుకింగ్, చెక్ ఇన్ సేవలు ఆగిపోయాయని తెలిపింది.
టెక్నాలజీకి ప్రత్యామ్నాయం లేకపోతే ఎలా ఉంటుందో చూస్తున్నామంటూకొంత మంది ప్రయాణికులు సెటైరికల్ గా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్ కూడా మైక్రో సాఫ్ట్ పై సెటైర్ వేశారు.
కార్పొరేట్ కంపెనీల్లో పని చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగులు ఆనంద పడుతున్నట్లుగా ఎక్కువ మంది పోస్టులు పెట్టారు.