Cervical Cancer Vaccine: 


దేశీయంగా తయారైన టీకా..


సర్వికల్ క్యాన్సర్‌కు చెక్ చెప్పే Quadrivalent Human Papillomavirus vaccine ను ఢిల్లీలో లాంచ్ చేశారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఈ టీకాను తయారు చేసింది. సెర్వావాక్ (CERVAVAC)గా పిలుచుకునే ఈ వ్యాక్సిన్‌ను పూర్తి దేశీయంగా రూపొందించారు. ఈ సందర్భంగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా కీలక ప్రకటన చేశారు. మరి కొద్ది నెలల్లోనే ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. దీని ధర రూ.200-400 మధ్యలో ఉంటుందని వెల్లడించారు. అయితే...ధర విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మొదట భారత్‌లోని మహిళలకు అందించి, తరవాత ప్రపంచ దేశాలకూ ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. మొత్తం 200 మిలియన్ డోస్‌లు తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. ఈ ఏడాది జులైలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) మార్కెట్ ఆథరైజేషన్‌కు అనుమతినిచ్చింది. ఆ తరవాతే దీన్ని దేశీయంగా తయారు చేశారు. ఈ టీకాతో సర్వికల్ 
క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయొచ్చని ధీమాగా చెబుతోంది సీరమ్ ఇన్‌స్టిట్యూట్. భారత్‌లో మహిళలకు రొమ్ము క్యాన్సర్ తరవాత ఎక్కువగా సోకుతున్న వ్యాధి సర్వికల్ క్యాన్సర్. ఈ టీకాకి సెర్వావాక్ అని పేరు పెట్టారు. అన్ని వర్గాల వారూ ఈ టీకా తీసుకునేలా తక్కువ ధరనే నిర్ణయిస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్‌ అదర్ పూనావాలా గతంలోనే వెల్లడించారు. వచ్చే ఏడాది అని అనుకున్నప్పటికీ ఈ ఏడాది నవంబర్ నాటికే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పుడే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు న్నాయనీ చెబుతున్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో వ్యాక్సిన్‌ను లాంచ్ చేశారు.






మరో ఘనత..


కొవిడ్ టీకా తరహాలోనే ఈ వ్యాక్సిన్‌ను కూడా రెండు, మూడు డోసులుగా తీసుకోవాలి. ఈ డోసుల మధ్య గ్యాప్ కూడా ఉండాలి అంటోంది సీరమ్. అన్ని డోసులూ తీసుకోకపోతే సర్వికల్  క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని చెప్పలేమని సీరమ్ సంస్థ స్పష్టం చేస్తోంది. హ్యూమన్ పపిల్లోమావైరస్ HPVగా పిలుచుకునే ఈ టీకా...70% మేర సర్వికల్ క్యాన్సర్‌ను నయం చేస్తుందని వెల్లడించింది. ఐదేళ్లలో పదిలో ఒక మహిళకు సర్వికల్ HPVఇన్‌ఫెక్షన్ సోకిందని, 2019లో ప్రపంచవ్యాప్తంగా 45 వేల మంది మహిళలు సర్వికల్ క్యాన్సర్‌తో మృతి చెందినట్టు WHO వెల్లడించింది. అందరి కంటే ముందుగా కొవిడ్ వ్యాక్సిన్‌ తయారు చేసి విదేశాలకు అందజేసిన ఘనత భారత్‌ది. కేవలం ఏడాది కాలంలో అత్యంత సమర్థవంతమైన టీకాను అందుబాటులోకి తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్ టీకాతో మరోసారి అలాంటి రికార్డునే సొంతం చేసుకోటానికి సిద్ధమవుతోంది. 


Also Read: Pawan Kalyan Birthday : 'బాహుబలి 2'లో ఆ సీన్ వెనుక ఉన్నది పవన్ కళ్యాణే