Uranium Reserves Searching in AP: ఏపీలో యురేనియం నిల్వలపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో యురేనియం (Uranium) ఖనిజం కోసం అన్వేషిస్తున్నట్లు కేంద్ర అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వైఎస్సార్ కడప (Kadapa), అన్నమయ్య (Annamayya), పల్నాడు (Palnadu), కర్నూలు (Kurnool) జిల్లాల్లో యురేనియం ఖనిజం కోసం అన్వేషణ చేపట్టినట్లు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలోని నల్లగొండవారిపల్లె, అంబకాపల్లె, బక్కన్నగారి పల్లె, శివారంపురం, పించ, కుమరంపల్లె, నాగాయపల్లెలు ఉన్నాయని చెప్పారు. అలాగే పల్నాడు జిల్లాలోని సారంగపల్లె, తంగెడ, మదినపాడు, కర్నూలు జిల్లాలో మినకహల్ పాడు, కప్పట్రాళ్ల, బొమ్మరాజుపల్లె, అన్నమయ్య జిల్లాలో కాటమయకుంట, వరికుంటపల్లెలు ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని కనంపల్లె, తెలంగాణలోని చిత్రియాల్ వద్ద కొత్త గనులు, ప్లాంట్లు ఏర్పాటు విషయంపై యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇటీవల అటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండీ) ఈ ప్రాంతాల్లో అన్వేషణ చేసినట్లు పేర్కొన్నారు. కాగా, ప్లాంట్ల ఏర్పాటు పనులు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో ఏఎండీ చేపట్టిన అన్వేషణలో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 4.10 లక్షల టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. సంత్ బల్బీర్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు బదులిచ్చారు.


ఆ రహదారి నిర్మాణంపై


మరోవైపు, జాతీయ రహదారి - 16లో విజయవాడ - గుండుగొలను మధ్య 104 కి.మీ రహదారి నిర్మాణానికి పలు అడ్డంకులు ఎదురవుతున్నట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కేంద్ర రహదారి, రవాణా శాఖ ఈ ప్రాజెక్టును 4 ప్యాకేజీలుగా చేపట్టినట్లు వివరించారు. ఇప్పటివరకూ 1, 2 ప్యాకేజీ పనులు పూర్తయ్యాయని, ప్యాకేజీ 3, 4ల్లో విజయవాడ బైపాస్ నిర్మాణం ఇమిడి ఉందని తెలిపారు. భూసేకరణ, కోర్టు కేసులు, విద్యుత్, టెలిఫోన్ లైన్ల బదిలీ కారణంగా ఇందులో జాప్యం జరిగినట్లు చెప్పారు.


Also Read: Tension in Punganur : పుంగనూరులో ఉద్రిక్తత - రామచంద్రయాదవ్ రైతు భేరీని అడ్డుకున్న పోలీసులు !,