MSP Hike announcements by the Union Cabinet :  కేంద్ర ప్రభుత్వం రైతులకు దీపావళి బహుమతి  ప్రకటించింది.  రబీ సీజన్‌లో పండించే 6 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకంది.  ఈ రబీ పంటల ఎంఎస్పీ పెంపు కోసం రూ.87,657 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. . గోధుమ, ఆవాలు, పెసర్లు, బార్లీ, శనగలు, సన్‌ఫ్లవర్ పంటలకు పెంపు వర్తిస్తుంది.  గోధుమలపై క్వింటాల్‌కు ఎంఎస్పీ రూ. 150 పెంచారు.   గతంలో క్వింటాల్‌ గోధుమ ధర రూ.2275 ఉండగా అది  రూ.2425కి పెరిగింది. క్వింటాల్‌ ఆవాలుకు ఎంఎస్పీ రూ.300 పెంచారు. తాజా పెంపుతో  గతంలో ఉన్న రూ.5,650 నుంచి రూ.5,950 కి పెరిగింది.                


 ఇక క్వింటాల్ పెసర్లకు రూ.275 మద్దతు ధర పెంచారు. ఇప్పుడు క్వింటాల్ పెసర్లకు రైతులకు  రూ. 6,425 నుంచి రూ.6,700 కి పెరిగిన ధర లభిస్తుంది.   ఇక బార్లీ పంట క్వింటాల్‌కు రూ.130 ఎంఎస్పీ పెంచారు.  ఇప్పుడు రూ.1,850 ఉన్న మద్దతు ధర ఇక నుంచి రూ.1,980కు పెరిగుతుంది.  శనగల ఎంఎస్పీ రూ.210 పెంచగా రూ.5,650కి పెరిగింది. సన్‌ఫ్లవర్‌ పంటకు ఎంఎస్పీ రూ.140 పెంచడంతో.. రూ.5,800 నుంచి రూ.5,940కి  చేరుకుంది.                          


ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో దక్కని ఊరట - ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశాలు


ఆరు పంటలకు మద్దతు ధరతో పాటు  రైతులకు మరిన్ని శుభవార్తలను కేంద్ర ప్రభుత్వం అందించింది. రైతుల ఆదాయాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా పీఎం అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌  పథకానికి రూ.35 వేల కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అదే సమయంలో రబీ పంట సీజన్‌కు సంబంధించి నాన్‌-యూరియా ఎరువుల సబ్సిడీకి రూ.24,475 కోట్లు   మంజూరు చేసింది.  


రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. ఇందు కోసం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతు కేంద్రంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  పెరుగుతున్న పెట్టుబడికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మద్దతు ధరలు పెంచుతూ వస్తోంది. కేంద్రం మద్దతు ధర పెంచితే వేలకోట్లు భారం పడతుంది. అయినా ఎప్పటికప్పుడు రైతులకు అండగా ఉండేందుకు త్వరిగతిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. 


ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు


రబీ సీజన్ లో అత్యధికంగా పండే పంటలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు   ఆరు పంటల ఎమ్మెస్పీ పెంచారు. రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలతో పాటు అత్యధిక రేటు లభించేలా మార్కెట్ వాతావరణాన్ని సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.  రైతుల ఆర్థికంగా అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని బీజేపీ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది.