Loan Apps Removed In Play Store : ప్రజలను తప్పుదారి పట్టించే 2,500 మోసపూరిత రుణ యాప్‌ (Loan Apps)లను ప్లే స్టోర్ (Play store) నుంచి గూగుల్ (Google) తొలగించింది. రుణయాప్స్ విషయంలో గూగుల్ కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం (Central Government)వెల్లడించింది.  కొత్త విధానంలో అనుమతి పొందిన యాప్‌లనే ఆ సంస్థ ప్లేస్టోర్‌లో అనుమతిస్తున్నట్లు తెలిపింది. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 జులై మధ్య 2,500 రుణ యాప్‌లను తొలగించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) పార్లమెంట్‌లో లిఖితపూర్వకం సమాధానం ఇచ్చారు. దేశ సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం (14సీ), కేంద్ర హోంశాఖ డిజిటల్‌ లోన్‌ యాప్‌లను పర్యవేక్షిస్తున్నాయని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్బీఐ, ఇతర నియంత్రణ సంస్థలతో సంప్రదిస్తూనే ఉందన్నారు. చట్టబద్ధంగా నడుస్తున్న లోన్‌ యాప్‌ల వివరాలను రిజర్వు బ్యాంకు.. ప్రభుత్వానికి అందించిందన్నారు. వాటిని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీశాఖ గూగుల్‌కు పంపిందని తెలిపారు. 


మహదేవ్‌ బెట్టింగ్ యాప్‌ కూడా


కొన్ని రోజుల క్రితం మహదేవ్‌(Mahadev) బెట్టింగ్ యాప్‌ సహా మరో 21 రకాల సాఫ్ట్‌వేర్‌లు, వెబ్‌సైట్లను నిషేధించింది. కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (Central IT Department)మంత్రిత్వశాఖ 22 చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్‌లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో మహదేవ్‌, రెడ్డీ అన్న ప్రెస్టోప్రో యాప్ లు ఉన్నాయి. ఇప్పటికే నిబంధనల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించేవిధంగా వివాదాస్పద యాప్ లను ఇండియా ప్లే స్టోర్‌ నుంచి 2,000పైగా లోన్‌ యాప్స్‌ను తొలగించింది. రుణాల యాప్‌ల సమస్య తారా స్థాయికి చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది గూగుల్ సంస్థ. రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినతరం చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. లోన్‌ యాప్‌ల సమస్య ఒక్కో మార్కెట్లో ఒకో రకంగా ఉంటోంది. అమెరికాలో పోటీ సంస్థలను దెబ్బతీసే విధమైన యాప్‌ల సమస్య ఉంది. భారత్‌లో తప్పుదోవ పట్టించే, నిబంధనలను ఉల్లంఘించడం రూపంలో యాప్‌ల ఉన్నాయి. తాము కార్యకలాపాలు సాగించే అన్ని దేశాల్లోనూ నియంత్రణ నిబంధనలను పాటించడానికి కట్టుబడి ఉన్నట్లు గూగుల్ సంస్థ వెల్లడించింది. 


గూగుల్ ప్లేస్టోర్ నుంచి ల‌క్ష‌లాది డౌన్‌లోడ్స్ జ‌రిగిన 17 స్పైలోన్ యాప్స్‌ను (Loan Apps) గూగుల్ ఇటీవ‌ల తొల‌గించింది. యూజ‌ర్ల స‌మాచారంపై నిఘా పెట్టాయ‌నే స‌మాచారంతో ప్లేస్టోర్ నుంచి ఈ యాప్స్‌ను గూగుల్ తొల‌గించింది. స్పైలోన్‌గా గుర్తించిన దాదాపు 18 యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాయ‌ని ఈఎస్ఈటీ రిపోర్ట్ తెలిపింది. ఈ నెల ప్రారంభంలో 17 యాప్స్‌ను గూగుల్ తొల‌గించింది. ఏఏ క్రెడిట్‌, అమోర్ క్యాష్‌, గౌయ‌బ‌క్యాష్‌, ఈజీ క్రెడిట్‌, క్యాష్‌వావ్‌, క్రెడిబ‌స్‌, ఫ్లాష్‌లోన్‌, ప్రిస్ట‌మోస్‌క్రెడిటో, ప్రిస్ట‌మోస్‌డీక్రెడిటో-యుమిక్యాష్‌, గో క్రెడిటో, ఇన్‌స్టాంటానియోప్రిస్ట‌మో, కార్టెరా గ్రాండె, ర్యాపిడో క్రెడిటో, ఫిన‌ప్ లెండింగ్‌, 4ఎస్ క్యాష్‌, ట్రూనైరా, ఈజీక్యాష్‌ వంటి యాప్ లను తొలగించింది గూగుల్.


Also Read: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్‌ అకౌంట్స్‌ ఉండొచ్చు, ఎక్కువ ఖాతాలుంటే నష్టమా?


Also Read:  ఈ ఏడాది బంపర్‌ కలెక్షన్స్‌ సాధించిన 10 హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌