Center announced Padma Vibhushan to Dr Nageshwar Reddy: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఏఐజీ ఆస్పత్రి అదినేత డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు. దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మ విభూషణ్.
తెలుగు రాష్ట్రాలకు చెందిన మంద కృష్ణ మాదిగ, మాడుగుల నాగఫణి శర్మలకు పద్మశ్రీ ప్రకటించారు. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ పోరాడు. మాడుగుల నాగఫణి శర్మ పండితునిగా గుర్తింపు పొందారు. కేఎల్ కృష్ణ, విద్యా, సాహిత్యం విభాగాల్లో పద్మశ్రీ పొందారు. మాడుగుల నాగఫణి శర్మ, కళా రంగం నుంచి.. మంద కృష్ణ మాదిగ, ప్రజా వ్యవహారాలు విభాగంలో.. మిరియాల అప్పారావు, కళారంగంలో.. వి రాఘవేంద్రాచార్య పంచముఖి, సాహిత్యం, విద్య విభాగంలో పద్మశ్రీ అవార్డులు పొందారు.
సినీరంగంలో బాలకృష్ణతోపాటు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, అలాగే సీనియర్ హీరోయిన్ శోభనకు సైతం పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది. కన్నడ నటుడు అనంతనాగ్, కేరళకు చెందిన హాకీ ఆటగాడు శ్రీజేష్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కపూర్ లకు పద్మభూషణ్ ప్రకటించారు. మొత్తం ఇరవైఆరు మందికి పద్మభూషణ్ అవార్డులు ఇచ్చారు.
ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి అయిన ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. విజయవాడలో ఇంటర్ పూర్తిచేశారు. కర్నూలు మెడికల్ కళాశాలలో చదువుకున్నారు. 2002 లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. చెన్నైలో ఇంటర్నల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, పీజీఏ చండీగఢ్‌లో డీఎం చేశారు. నిమ్స్‌లో పనిచేశారు. తర్వాత గాంధీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2013 ప్రపంచ అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులుగా ఈయన ఎంపికయ్యారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించిన ఎండోస్కోపీ చికిత్సల్లో అనేక కొత్త విధానాలు వైద్య ప్రపంచానికి అందించారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధుల పరిశోధనల కోసం అత్యుత్తమ పరిశోధనాలయం ఏర్పాటు చేయడం, రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం వంటివి చేశారు. ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హార్వర్డ్, హాంకాంగ్ తర్వాత మూడో స్థానంలో ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీ కోటి రూపాయల జీతం ఆఫర్‌చేసినావెళ్ళలేదు.స్వదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.ఇప్పుడు విదేశీయులే ఈయన దగ్గర శిక్షణకు వస్తున్నారు.
మందకృష్ణ మాదిగ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన పోరాడారు. ఇటీవల తన పోరాటంలో అనుకున్నది సాధించారు. ఆయన పోరాటానికి గుర్తుగా కేంద్రం ఈ పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. గతంలో పలు రాజకీయ పార్టీలు ఆయనకు పదవులు ఆఫర్ చేసినా తీసుకోలేదు.