Case registered against TVK president Vijay:  తమిళనాడు రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి.  తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీ పెట్టి భారీ బలప్రదర్శనలు చేస్తున్న విజయ్‌పై తాజాగా కేసు నమోదు అయింది.  మధురైలో జరిగిన రాజకీయ సభ సమయంలో దాడి జరిగిందని ఆరోపించి, ఒక TVK కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.      

 ఆగస్టు 21, 2025న మధురై జిల్లా పరపత్తి వద్ద TVK పార్టీ రెండవ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.    దీనికి భారీ ఏర్పాట్లు చేశారు. ర్యాంప్ ఏర్పాటు చేసి దానిపై నడుస్తూ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఆ సమయంలో ఓ ఫ్యాన్ ర్యాంప్ పైకి దూసుకు వచ్చాడు. అతన్ని విజయ్ సెక్యూరిటీ పట్టుకుని కిందకు నెట్టేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

అయితే ఆ కార్యకర్త  ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత చెన్నైలోని పెరంబలూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై విజయ్ భద్రతా సిబ్బంది దాడి చేశారని ఫిర్యాదు చేశారు.  దాంతో పోలీసులు విజయ్ తో ఆయనకు భద్రతగా ఉన్న బౌన్సర్లపై  కేసు నమోదు చేశారు.   

అతను విజయ్ అభిమానే.  ఇతర పార్టీల వాళ్లు అతన్ని ప్రభావితం చేసి ఫిర్యాదులు చేయించి ఉంటారని విజయ్ పార్టీ నేతలు అంటున్నారు.  వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.