Car stunt Viral Video: మహారాష్ట్రలోని  సతారా జిల్లాలోని సదావాఘాపూర్‌లోని టేబుల్ పాయింట్ వద్ద 20 ఏళ్ల సునీల్ జాదవ్ సోషల్ మీడియా రీల్స్ కోసం కారు స్టంట్స్ చేస్తూ నియంత్రణ కోల్పోయి, 300 అడుగుల లోతైన లోయలో పడిపోయాడు టేబుల్ పాయింట్, గుజర్వాడీ ప్రాంతంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడి నుంచి వాటర్స్ ఫాల్స్ చూసేందుకు పెద్దఎత్తున పర్యాటకులు వస్తారు.    

ఇరవై ఏళ్ల సునీల్ జాదవ్  కరాద్‌లోని ఘోలేశ్వర్ నివాసి తన స్నేహితులతో కలిసి సదావాఘాపూర్‌లోని టేబుల్ పాయింట్‌కు  విహారయాత్ర కోసం వచ్చాడు.  సునీల్ కారులో ఉండగా, అతని స్నేహితులు ఫోటోలు తీసుకోవడానికి బయట ఉన్నారు. ఈ సమయంలో సునీల్ సోషల్ మీడియా రీల్ కోసం కారు స్టంట్ చేస్తుండగా, కారు నియంత్రణ కోల్పోయి 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది .

ఈ ఘటనను సమీపంలో గొర్రెలను మేపుతున్న మంగేష్ తుకారామ్ జాదవ్ , విహారయాత్రకు వచ్చిన  కొంత మంది  విద్యార్థులు గమనించారు. వారు వెంటనే సునీల్‌ను రక్షించేందుకు సహాయం చేశారు.   తీవ్ర గాయాలతో  అతి కష్టం మీద సునీల్ ను బయటకు తీసుకు వచ్చారు. ఆస్పత్రికి తరలించారు.  అతని పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.  

టెబుల్  పాయింట్, సతారాలోని గుజర్వాడీ ప్రాంతంలో ఉంది.  ఈ ప్రాంతంలో రక్షణ రైలింగ్‌లు లేకపోవడం వల్ల ఇది ప్రమాదకరమైన ప్రదేశంగా మారింది. గతంలో కూడా ఇక్కడ ప్రమాదాలు జరిగినప్పటికీ, అధికారులు భద్రతా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.