International Law On PoJK Merger With India:   పాక్ ఆక్రమిత జమ్మూ అండ్ కశ్మీర్ (PoJK) , గిల్గిత్-బాల్టిస్తాన్‌లలో పాకిస్తాన్ ప్రభుత్వ అణచివేత, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు. "మాకు పాకిస్తాన్ వద్దు.. చట్టబద్ధమైన భారతదేశంలోనే కలిసిపోతాం" అనే నినాదాలు క్షేత్రస్థాయిలో బలంగా వినబడుతున్నాయి. ఒకవేళ అక్కడి ప్రజలు పూర్తిస్థాయిలో తిరుగుబాటు చేసి భారత్‌లో కలుస్తామని అధికారికంగా కోరితే.. భారత ప్రభుత్వం వారిని నేరుగా కలుపుకోగలదా? దీనికి అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమి  నిబంధనలు అంగీకరిస్తాయా?    రాజ్యాంగబద్ధంగా, లీగల్‌గా PoJK భారత్‌దే! 

Continues below advertisement

అంతర్జాతీయ చట్టాల పరంగా చూస్తే.. 1947 అక్టోబర్ 26న జమ్మూ కశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ భారతదేశంతో కుదుర్చుకున్న విలీన ఒప్పందం పై సంతకం చేశారు. బ్రిటీష్ ఇండియా చట్టాల ప్రకారం ఈ ఒప్పందం 100% చట్టబద్ధమైనది. దీని ప్రకారం యావత్ జమ్మూ కశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. కాబట్టి, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ప్రాంతం అంతర్జాతీయ చట్టాల ప్రకారం అక్రమ ఆక్రమణ  కిందకే వస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం కూడా PoJK భారతదేశంలో అంతర్భాగమే.   ఆ ప్రాంతం కోసం ప్రత్యేకంగా 24 అసెంబ్లీ స్థానాలను ఖాళీగా ఉంచడం, 1994లో పార్లమెంట్ ఏకగ్రీవంగా  PoJKని తిరిగి స్వాధీనం చేసుకోవడమే ఏకైక ఎజెండా  అని తీర్మానించడం దీనికి బలమైన సాక్ష్యాలు.  అంతర్జాతీయ చట్టాలు ,  UN తీర్మానాల చిక్కులు 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి  తీర్మానం 47 ప్రకారం.. కశ్మీర్ సరిహద్దుల్లో ప్రజాభిప్రాయ సేకరణ  జరగాలి. అయితే, దీనికి మొదటి నిబంధన ఏంటంటే.. పాకిస్తాన్ కశ్మీర్ భూభాగం నుండి తన సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి. కానీ, పాక్ గత ఏడు దశాబ్దాలుగా ఆ పని చేయలేదు సరికదా, అక్కడ జనాభా సమతుల్యతను దెబ్బతీస్తూ పాకిస్తానీయులను తెచ్చి స్థిరపరిచింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. ఒక దేశంలో అంతర్గతంగా అణచివేతకు గురవుతున్న ప్రజలు స్వయం నిర్ణయాధికారం  కింద వేరే దేశంలో విలీనం కోరవచ్చు. గతంలో బంగ్లాదేశ్, క్రిమియా ఉదంతాల తరహాలో . కాబట్టి PoJK ప్రజలు స్వచ్ఛందంగా తిరుగుబాటు చేస్తే, వారికి మద్దతుగా నిలిచే నైతిక, చట్టపరమైన హక్కు భారత్‌కు ఉంటుంది. 

Continues below advertisement

 అక్కడి ప్రజలంతా భారత్‌లో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారా? 

 PoJK లోని అందరు పౌరుల ఆలోచనలు ఒకేలా లేవు. అక్కడ మూడు రకాల వాదనలు ఉన్నాయి. మొదటి వర్గం.. పాక్ నరకం కంటే భారత్ వైపు ఉన్న జమ్మూ కశ్మీర్ సాధిస్తున్న అద్భుతమైన ఆర్థిక ప్రగతిని, శాంతిభద్రతలను చూసి భారత్‌లో విలీనమవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు. రెండవ వర్గం.. పాకిస్తాన్, భారత్ రెండింటికీ దూరంగా స్వతంత్ర కశ్మీర్  కావాలని ఆశిస్తున్నారు. మూడవ వర్గం.. ఇస్లామాబాద్ ప్రభుత్వం పెంచి పోషించిన తీవ్రవాద సానుభూతిపరులు. అయితే, ప్రస్తుతం పాక్‌లో ఉన్న ఆర్థిక దారిద్ర్యం, గోధుమ పిండి కోసం కొట్టుకునే పరిస్థితుల వల్ల.. స్వతంత్రంగా బతకడం సాధ్యం కాదని గ్రహించిన మెజారిటీ ప్రజలు ,  మేధావులు, భారత్ వైపు మొగ్గు చూపడమే సురక్షితమైన మార్గమని భావిస్తున్నారు.   

 భారత్ వ్యూహం యుద్ధం లేకుండానే స్వాధీనం? 

భారత ప్రభుత్వం ప్రస్తుతానికి సైనిక చర్య   ద్వారా PoJKని ఆక్రమించుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రక్షణ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. మోదీ ప్రభుత్వం సా ఫ్ట్ పవర్ & దౌత్య వ్యూహం అమలు చేస్తోంది. పాకిస్తాన్ ఆర్థికంగా పూర్తిగా పతనమై, బలూచిస్తాన్, కేపికే  ప్రాంతాల్లో అంతర్గత యుద్ధాలతో ముక్కలయ్యే స్థితికి చేరుకుంది. ఇలాంటి తరుణంలో గిల్గిత్, ముజఫరాబాద్ ప్రజల తిరుగుబాటు తీవ్రరూపం దాల్చి, వారు సరిహద్దులు దాటి భారత్ వైపు రావడం ప్రారంభిస్తే.. మానవతా దృక్పథంతో భారత్ ఆ భూభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకునే వ్యూహాన్ని అమలు చేస్తోంది. అంతర్జాతీయంగా చైనా అడ్డుపడే అవకాశం ఉన్నప్పటికీ, లీగల్ అథారిటీ భారత్ వైపే ఉండటం వల్ల ప్రపంచ దేశాలను ఒప్పించడం న్యూఢిల్లీకి పెద్ద కష్టమేమీ కాదు.