నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా భారత్‌లోనూ కొన్నేళ్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరిగింది. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి ఆస్తి చూపుతున్నప్పటికీ.. మార్కెట్లో దీని వేగం కొద్దిగా మందగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇష్టపడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలలో వృద్ధి కనిపించింది. ప్రస్తుతం వృద్ధి రేటు ఆశించినంత లేవని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. 

Continues below advertisement

ఇటీవల వచ్చిన ఒక నివేదిక ప్రకారం భారత మార్కెట్లో ఈవీ (EV) అమ్మకాల వేగం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం సాంకేతిక లోపం ఏమీ కాదు, కానీ ఇళ్లలోని బలహీనమైన ఎలక్ట్రికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హోమ్ ఛార్జింగ్‌కు స్థలం లేకపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఆశించినంతగా లేవు. ఈ సౌకర్యం మెరుగైతే, ఎక్కడ పడితే అక్కడ బ్యాటరీ మార్చుకునే అవకాశం ఉంటే విక్రయాల్లో ఊహించని మార్పులు సాధ్యమే.

ఇంట్లో ఛార్జింగ్ సదుపాయం లేదు భారత్‌లో జరిగే ఈవీ విక్రయాలలో దాదాపు 91 శాతం వాటా టూవీలర్, త్రీ వీలర్ వాహనాలదే ఉంది. వీటికి ఇంట్లోనే హోమ్ ఛార్జింగ్ చేసుకోవడం చాలా అవసరం. కానీ, దేశంలో ఈవీ కొనాలనుకునే కస్టమర్లలో కేవలం 55 శాతం మందికి మాత్రమే ఇంట్లో వాహనాన్ని ఛార్జ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.

Continues below advertisement

Also Read: జులై 2026 కార్ లాంచ్‌లు ఇవే - మారుతి, హోండా, స్కోడా, MG కొత్త కార్లపై భారీ అంచనాలు

మిగిలిన వారు తమ వాహనాన్ని ఛార్జ్ చేసుకోవడానికి పబ్లిక్ స్టేషన్లపై ఆధారపడుతూ అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హోమ్ ఛార్జింగ్‌కు సంబంధించిన ఈ పెద్ద లోపం కారణంగా మరింత మందికి ఈవీ చేరువ కాలేకపోతోంది. 

అడ్డంకిగా మారిన ఎన్ఓసీఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ.. అపార్ట్‌మెంట్లు, సొసైటీలు, అద్దె ఇళ్లలో నివసించే 70 నుండి 75 శాతం పట్టణ కుటుంబాలకు ఇబ్బందులు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో కామన్ పార్కింగ్ స్థలం ఉంటుంది. అక్కడ సొంత పర్సనల్ ఛార్జర్‌ను ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టం. ఛార్జర్ ఇన్‌స్టాల్ చేయడానికి యజమానులు,  రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (RWA) నుండి అనుమతి లేదా ఎన్‌ఓసి తీసుకోవలసి ఉంటుంది. దాంతో దరఖాస్తులు చేసుకుని పర్మిషన్ కోసం ఎదురుచూడక తప్పదు. విద్యుత్ కంపెనీల నుండి మీటర్ లోడ్ పెంచడం కూడా సామాన్యులకు తలనొప్పి లాంటిదే. దీనివల్ల ప్రజలు విసిగిపోయి ఈవీ కొనే ప్లాన్‌ను వదిలేసుకుంటున్నారు.

బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ప్రమాదంఎలక్ట్రిక్ వాహనం కోసం ఇంట్లో సరైన సెటప్ లేకపోతే చాలా మంది విధిలేక ప్రత్యామ్నాయ మార్గాల సహాయం తీసుకుంటున్నారు. ప్రజలు తమ బాల్కనీ లేదా కిటికీ నుండి పొడవైన ఎక్స్‌టెన్షన్ బోర్డులను వేలాడదీసి లేదా ఏదైనా సాకెట్ల నుంచి ఈవీలను కనెక్ట్ చేస్తున్నారు. సాధారణ సాకెట్లు నిరంతరం చాలా గంటల పాటు ఈవీ భారీ లోడ్‌ను తట్టుకోలేవు. 

ఈ కారణంగా వైర్లు కరిగిపోవడం, మంటలు చెలరేగడం, వోల్టేజ్ హెచ్చుతగ్గుల ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నిర్లక్ష్యం వాహనంలోని ఖరీదైన బ్యాటరీని డ్యామేజ్ చేయడంతో పాటు ఇంటి భద్రతను ప్రమాదంలో పడేసే అవకాశాలున్నాయి. ఈ కారణాల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరుగుతున్నా, ఆశించిన వృద్ధి కనిపించడం లేదు.

Also Read: ఏ కాంపాక్ట్ SUVకి లేని శక్తితో వచ్చిన టాటా సియరా EV!బేసిక్‌, టాప్‌ వేరియంట్‌ ధరలు ఎలా ఉన్నాయి?