ముంబయి సబర్బన్ బంద్రాలో ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఐదుగురు చిక్కుకున్నట్లు సమాచారం. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అక్కడికి చేరుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు.
సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు ఏడుగురిని సహాయక సిబ్బంది రక్షించి దగ్గర్లోని రెండు ఆసుపత్రులకు తరలించినట్లు బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎమ్‌సీ) తెలిపింది. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొంది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సర్కార్ ఆదేశించింది.
ఆరు అంబులెన్స్‌లు, ఐదు అగ్నిమాపక వాహనాలు, ఒక సహాయక వాహనం ఘటనాస్థలంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Republic day 2022: వాయుసేన శకటంతో 'శివాంగి' కవాతు.. రఫేల్ జెట్ తొలి మహిళా పైలట్ విశేషాలివే!
Also Read: Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..