హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలోని చింతల్‌లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అక్క చనిపోయిందని తెలియని ఇద్దరు అన్నాచెల్లళ్లు ఆ మృతదేహంతో వారం రోజుల పాటు సహజీవనం చేశారు. 

జీడిమెట్ల పియస్ పరిధి చింతల్‌లో ఓ ఇంట్లో ఖమ్మంకు చెందిన కుటుంబం నివాసం ఉంటుంది. ముగ్గురు ఉంటున్నారు. అక్క రాధ (45), అన్న( 40), చెల్లెలు (35) నివాసం ఉంటున్నారు. వీరిలో ఎవరికీ వివాహాలు కాలేదు. అయితే మూడు రోజుల క్రితం రాధ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందారు. మిగతా ఇద్దరు మతిస్థిమితం లేని కారణంగా ఆమె చనిపోయిందన్న విషయంగాన్ని గుర్తించలేకపోయారు. దీంతో వారం రోజులుగా ఆ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. ఎవరికీ కనీసం సమాచారం కూడా ఇవ్వలేకపోయారు. 

మూడు రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తనిఖీ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని అనుమానించిన పోలీసులు మృతదేహాన్ని తరలించి కేసు  నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.