Bride Calls Off Marriage: ఈ రోజుల్లో మగాళ్లకు కఠిన పరీక్షలు ఎదురవుతున్నాయి. పెళ్లి అయ్యే వరకూ పెళ్లి కూతురు ఎక్కడ తన ప్రవర్తన నచ్చదో..ఎక్కడ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోతుందో అని టెన్షన్ పడాల్సి వస్తోంది. చివరికి నుదుటన సిందూర్ దిద్దేటప్పుడు చేయి వణికిందని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నారు.
బీహార్‌లోని కైమూర్ జిల్లాలో పెళ్లి లో నుదుటన సిందూరం దిద్దేటప్పుడు సమయంలో వరుడి చేయి వణకడంతో వధువు పెళ్లిని రద్దు చేసింది. ఈ ఘటన భభువా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వరుడు ఘనమైన బారాత్‌తో వధువు ఇంటికి వచ్చాడు. అన్ని ఆచారాలు ఆనందంగా నిర్వహించారు. అయితే, సిందూరం రాసే సమయంలో వరుడి చేయి వణకడంతో, వధువు అతన్ని "పిచ్చివాడు" అని పిలిచి, పెళ్లికి నిరాకరించింది. వరుడు మ, అతని కుటుంబం ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
సమాచారం అందిన తర్వాత, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రెండు కుటుంబాలను భభువా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.. చర్చలు జరిపినప్పటికీ, ఒప్పందం కుదరలేదు, చివరకు వరుడు వధువు లేకుండా తిరిగి వెళ్లవలసి వచ్చింది.
పెళ్లి రద్దయిన తర్వాత, వధువు కుటుంబం కట్నం డబ్బును తిరిగి ఇవ్వమని కోరింది. పెళ్లికి 1 లక్షకు ఒప్పందం జరిగింది. మాకు 90,000 నగదు వచ్చింది. అందులో 30,000 నగల కోసం, 20,000 చీరల కోసం, 10,000 డీజే సంగీతం కోసం, మిగిలినవి రవాణా కోసం ఖర్చు చేశాము. డబ్బు అంతా ఖర్చైపోయింది అని చెప్పి చేతులెత్తేశారు.
అన్ని ఆచారాలు పూర్తయ్యాయి. సిందూరం సమయంలో, బహుశా శబ్దం లేదా ఒత్తిడి కారణంగా వరుడి చేయి వణికింది. వధువు అకస్మాత్తుగా వరుడు పిచ్చివాడని చెప్పి, ఆమె కుటుంబం డబ్బు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేయడం ప్రారంభించిందని బంధువులు మండిపడుతున్నారు. వధువు పెళ్లికి నిరాకరించడంతో రెండు వైపుల వారు స్టేషన్‌కు వచ్చారు. మేము సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాము, కానీ వధువు కుటుంబం ఒప్పుకోలేదు. ఇప్పటివరకు ఏ వైపు నుండి అధికారిక ఫిర్యాదు అందలేదు అని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అలాంటి అమ్మాయితో జీవితం పంచుకోలేవని వదిలేయాలని సలహాలిస్తున్నారు.