Breaking News Today Live: చియాన్ విక్రమ్ పెద్ద మనసు - వయనాడ్ బాధితులకు రూ.20 లక్షలు విరాళం

Andhra Pradesh And Telangana Breaking News: తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అప్‌డేట్స్‌తోపాటు జాతీయ అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి. ఒలింపిక్స్‌లో పతకాల అప్ డేట్స్‌నూ ఇక్కడ చూడొచ్చు.

Continues below advertisement

LIVE

Background

Breaking News In India Today in Telugu: లిక్కర్ స్కామ్‌లో అరెస్టై తిహార్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈడీ కేసులో ఆమె జ్యుడిషియల్‌ రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు వెల్లడించింది. ఆగస్టు 13 వరకు ఆమె జ్యుడిషియల్ రిమాండ్‌ను ట్రయల్‌ కోర్టు పొడిగించింది. 

ఒలింపిక్స్‌లో ఇవాళ్టి మ్యాచ్‌లు

పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండో పతకంతో నాల్గో రోజు ఆట ముగించిన భారత్‌ ఐదో రోజు కీలక ఈవెంట్స్‌లలో తలపడనుంది. 5వ రోజు PV సింధు, లోవ్‌లీనా బోర్గోహైన్, లక్ష్య సేన్, మానికా బాత్రా వంటి వారు ప్రత్యర్థులతో తలపడనున్నారు. పతకాలు సాధించడంలో ప్రధాన పోటీదారులుగా ఉన్న వీళ్లు ఎలాంటి ప్రతిభ చూపిస్తారో అన్న యావత్ దేశం ఆశగా ఎదురు చూస్తోంది. 

ఇప్పటికే ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో రెండు కాంస్య పతకాలు వచ్చాయి. సింగిల్ ఈవెంట్‌లో పతకం సాధించిన మను భాకర్‌... మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి రెండో పతకం గెలుచుకున్నారు. ఈ దెబ్బకు పలు రికార్డులను ఈ జోడీ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టి మిగతా క్రీడాకారులపై పడింది. 
బ్యాడ్మింటన్:
మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్: పివి సింధు Vs కుబా క్రిస్టిన్ (ఎస్టోనియా)
పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్: లక్ష్య సేన్ Vs జోనటన్ క్రిస్టీ (ఇండోనేషియా) 
ఈ మ్యాచ్‌లు మధ్యాహ్నం 12:50 నుంచి ప్రారంభంకానున్నాయి. 
షూటింగ్‌:- 
పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ క్వాలిఫికేషన్స్‌:- ఐశ్వరీ ప్రతా్‌పసింగ్‌ తోమర్‌, స్వప్నిల్‌ కుశాలె (మ. 12.30)
మహిళల ట్రాప్‌ క్వాలిఫికేషన్స్‌ రౌండ్‌ 2:- శ్రేయాసి సింగ్‌, రాజేశ్వరీ కుమారి (మ. 12.30) 

బ్యాడ్మింటన్‌:-
మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌: పీవీ సింధు (మధ్యాహ్నం 12.50)
పురుషుల సింగిల్స్‌ : లక్ష్యసేన్‌ (మధ్యాహ్నం1.40), 
ప్రణయ్‌  (రాత్రి 11.00)

టేబుల్‌ టెన్నిస్‌:-
మహిళల సింగిల్స్‌ రౌండ్‌ 32: ఆకుల శ్రీజ (మధ్యాహ్నం2.20)

బాక్సింగ్‌:-
మహిళల 75 కిలోల ప్రీ క్వార్టర్స్‌: లవ్లీనా (మధ్యాహ్నం 3.50)
పురుషుల 71 కిలోల ప్రీక్వార్టర్స్‌: నిషాంత్‌ గీ జోస్‌ (రాత్రి 12.18)

ఆర్చరీ:-
మహిళల వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్‌ రౌండ్‌: దీపికా కుమారి (మధ్యాహ్నం 3.56)
పురుషుల వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్‌ రౌండ్‌ - తరుణ్‌దీప్‌ (రాత్రి 9.15)
ఈక్వెస్ట్రియన్‌

డ్రెస్సేజ్‌ వ్యక్తిగత గ్రాండ్‌ ప్రీ: అనూష్‌ అగర్వాల (మధ్యాహ్నం 1.30).

Continues below advertisement
16:44 PM (IST)  •  31 Jul 2024

చియాన్ విక్రమ్ పెద్ద మనసు - వయనాడ్ బాధితులకు రూ.20 లక్షలు విరాళం

Kollywood hero Chiyaan Vikram donates Rs 20 lakh to victims of Wayanad landslide: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ ప్రాంతంలో తవ్వేకొద్ది శవాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో చాలామంది ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్.. బాధితులను ఆదుకోడానికి ముందుకొచ్చాడు. తనవంతు సాయంగా రూ.20 లక్షలు విరాళం ప్రకటించాడు. 

16:02 PM (IST)  •  31 Jul 2024

Telangana Assembly: ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం - సభ రేపటికి వాయిదా

Telangana Assembly Updates: తెలంగాణ అసెంబ్లీ గురువారానికి వాయిదా పడింది. బీఆర్ఎస్ నేతల నిరసనల మధ్యే కొన్ని బిల్లులకు స్పీకర్ ఆమోదం తెలిపారు. ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను ఆగస్టు 1కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

14:06 PM (IST)  •  31 Jul 2024

Paris Olympics 2024: కుబా క్రిస్టిన్‌ను మట్టికరిపించిన సింధు- ఒలింపిక్స్‌లో మరో అడుగు ముందుకు!

PV Sindhu beats Kuuba Kristin In Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో సింధు మరో అడుగు ముందుకు వేసింది.  కుబా క్రిస్టిన్‌తో జరిగిన మ్యాచ్‌లో పివి సింధు 21-5, 21-10తో ఓడించి 'స్ట్రైట్ గేమ్‌ల' విజయాన్ని నమోదు చేసింది. 

12:12 PM (IST)  •  31 Jul 2024

Hyderabad News: ముచ్చర్లలో నిర్మించే పోర్ట్‌ సిటీయే నయా హైదరాబాద్‌- అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన 

Hyderabad News: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ముచ్చర్లలో నిర్మిస్తున్న పోర్ట్‌ సిటీయే భవిష్యత్‌లో కీలకం కానుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అది నాల్గో నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఉపాధి కావాలన్నా ఏ రంగంలో ఉద్యోగాలు కావాలన్నా ముచ్చర్ల వెళ్లాల్సిందేనన్నారు రేవంత్ రెడ్డి 

11:38 AM (IST)  •  31 Jul 2024

Preeti Sudan: యూపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా ప్రీతి సూదన్ 

Preeti Sudan as the new Chairperson of UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్‌ను కేంద్రం నియమించింది. 1983 బ్యాచ్ ఆంధ్ర ప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రీతీ సుదాన్. సూదాన్ ఇంతకు ముందు UPSACలో సభ్యురాలిగా ఉండేవాళ్లు.  గతంలో ఆమె ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పని చేశారు. 

Sponsored Links by Taboola