Telugu breaking News: పవన్‌ కామెంట్స్‌తో టీడీపీ అలర్ట్‌- కాసేపట్లో చంద్రబాబు ప్రెస్‌మీట్‌!

Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

ABP Desam Last Updated: 26 Jan 2024 12:30 PM
పవన్‌ కామెంట్స్‌తో టీడీపీ అలర్ట్‌- కాసేపట్లో చంద్రబాబు ప్రెస్‌మీట్‌!

టీడీపీ పొత్తు ధర్మం పాటించకుండా రెండు సీట్లు ప్రకటించిందని అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేన అధినేత పోటీగా సీట్లకు అభ్యర్థులు ప్రకటించారు. దీంతో కూటమిలో అలజడి రేగింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నేతలతో చర్చిస్తున్నారు. వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కాసేపట్లో మీడియా ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. 


అసలు ఏం జరిగింది. ఎందుకు ఆ రెండు సీట్లు ప్రకటించారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మిగతా సీట్లపై ఎలా ముందుకు వెళ్లాలి. పవన్‌ తో ఏం మాట్లాడాలనే విషయాలపై నేతలతో మంతనాలు జరుపుతున్నారు. 


అన్నింటిపై స్పష్టత వచ్చిన తర్వాత కీలక నిర్ణయంపై మీడియాతో మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. 

Pro Kodandaram: ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఎమ్మెల్సీగా నియామకం

గవర్నర్ కోటాలొ ఇద్దరు ఎమ్మెల్సీలను తమిళిసై నియమించారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీ ఖాన్ నియమితులు అయ్యారు.  

246 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ ముగించిన ఇంగ్లండ్‌


ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 246 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ చివరి వికెట్ రూపంలో కెప్టెన్ బెన్ స్టోక్స్ వెనుదిరగడంతో ఇన్నింగ్స్‌కు తెరపడింది. స్టోక్స్ 70 పరుగులు చేసాడు. బుమ్రా బౌలింగ్ అవుట్‌ అయ్యాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలర్లలో జడేజా, అశ్విన్ జోడీకి మూడేసి వికెట్లు దక్కాయి. బుమ్రా, అక్షర్ 2 వికెట్లు పడగొట్టారు.

IND vs ENG Live Score: లంచ్ విరామ సమయానికి 108 పరుగులు చేసిన ఇంగ్లండ్

28 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. జో రూట్ 35 బంతుల్లో 18 పరుగులు చేశాడు. బెయిర్ స్టో 44 బంతుల్లో 32 పరుగులు చేశాడు.

IND vs ENG Live Score: తిప్పడం ప్రారంభించిన టీమిండియా బౌలర్లు

IND vs ENG Live Score: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్‌ ఇంగ్లండ్ మధ్య  జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. ప్రస్తుతానికి అశ్విన్ 2 వికెట్లు తీస్తే.. రవీంద్ర జడేజా కూడా రెండు వికెట్లు తీశాడు. 25 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. జో రూట్ 28 బంతుల్లో 16 పరుగులు చేశాడు. జానీ బెయిర్ స్టో 25 పరుగులు చేశాడు. వీరు 39 పరుగుల భాగస్వామ్యంతో ఆడుతున్నారు. 


 

IND vs ENG Live Score: ఇంగ్లాండ్ 25 ఓవర్లలో 99 పరుగులకు మూడు వికెట్లు 

IND vs ENG Live Score: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్‌ ఇంగ్లండ్ మధ్య  జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ క్రమంగా పై చేయి సాధిస్తోంది. మొదట్లో ధాటిగా ఆడిన ఇంగ్లిష్‌ బ్యాటర్లు స్పిన్ మాయాజాలంలో చిక్కుకున్నారు. 25 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. జో రూట్ 28 బంతుల్లో 16 పరుగులు చేశాడు. జానీ బెయిర్ స్టో 25 పరుగులు చేశాడు. వీరు 39 పరుగుల భాగస్వామ్యంతో ఆడుతున్నారు. 

Telangana Governor Tamilisai Comments : ఓటర్లను ఒత్తిడికి గురి చేస్తారా? పాడి కౌశిక్‌ కామెంట్స్‌పై గవర్నర్ సీరియస్ 

Telangana Governor Tamilisai Comments : ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల కామెంట్స్‌పై తెలంగాణ గవర్నర్  తమిళిసై సీరియస్ అయ్యారు. ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి మాట్లాడారన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచార అంశాన్ని ప్రస్తావించారు ఆమె. ఎలక్షన్ కమిషన్ అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యం బతకాలి అంటే అందరూ ఓటు వేయాలన్నారు. 

IND vs ENG Live Score:  క్రాలీ-డకెట్ మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం పూర్తి

ఇంగ్లండ్ స్కోరు 50 పరుగులు దాటింది. డకెట్, క్రౌలీ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఇంగ్లాండ్ 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. డకెట్ 34, క్రాలీ 17 పరుగులు చేశారు.

Background

Latest Telugu breaking News: 5 టెస్టుల సిరీస్‌లో హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకున్నట్లే రజత్‌ పాటిదార్‌కు జట్టులో చోటు దక్కలేదు. కుల్‌దీప్‌ యాదవ్‌, ధ్రువ్‌ జురేల్‌, ముకేష్‌ కుమార్‌ కూడా బెంచ్‌కు పరిమితమయ్యారు. జురెల్‌ బెంచ్‌కే పరిమితం కావడంతో కె.ఎస్‌. భరత్‌కు జట్టులో స్థానం దక్కింది. 


పుష్కరంగా ఓటమి లేకుండా...  
సొంత గడ్డపై టెస్టు సిరీసుల్లో 12 ఏళ్లుగా ఓటమి ఎరుగని భారత్‌ జట్టు(Team India)కు సిసలైన పరీక్ష ఎదురుకానుంది. బజ్‌బాల్‌ ఆటతో సుదీర్ఘ ఫార్మాట్‌లో వేగాన్ని పెంచిన ఇంగ్లాండ్‌...దశాబ్దకాలానికిపైగా సొంతగడ్డపై తిరుగులేని టీమిండియాకు సవాలు విసరనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని... ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. విజయంతో సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. సొంతగడ్డపై భారత్‌ టెస్టు సిరీస్‌ ఓడి దాదాపు 11 ఏళ్లు గడిచిపోయాయి. చివరగా 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-2తో భారత్‌ కోల్పోయింది. అప్పటి నుంచి సొంతగడ్డపై భారత్‌ మరో టెస్టు సిరీస్‌ ఓడిపోలేదు. కనీసం ప్రత్యర్థికి సిరీస్‌ డ్రా చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. తొలి టెస్టు జరిగే ఉప్పల్‌ పిచ్‌ స్పిన్‌కు సహకరించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లే సంపూర్ణ ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌ టీమ్‌ఇండియాకు ఎంతో కీలకం. దీంతో ఇప్పుడు అందరిదృష్టి ఈ సిరీస్‌పై పడింది.


కోహ్లీ లేకుండానే...
టెస్టుల్లో ఉప్పల్‌ వేదికలో దాదాపు 75 పైగా సగటు ఉన్న స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ లేకుండా టీమిండియా ఈ ‌మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో యువ ఆటగాడు యశ్వసి జైస్వాల్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. గిల్‌ మూడో స్థానంలో రానున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ మిడిల్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ భారాన్ని మోయనున్నారు. వికెట్‌ కీపర్‌గా ఆంధ్ర ఆటగాడు కేఎస్‌ భరత్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఆల్‌రౌండర్‌ జడేజా, అశ్విన్‌ స్పిన్‌పై భారత్‌ భారీ ఆశలు పెట్టుకుంది. బుమ్రా, సిరాజ్‌ పేస్‌ భారాన్ని మోయనున్నారు. ఈ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తామని....ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ గెలుస్తామని భావిస్తున్నట్లు కెప్టెన్ రోహిత్‌ శర్మ అన్నాడు.


బజ్‌బాల్‌ పనిచేస్తుందా..?
మరోవైపు ప్రత్యర్థి ఎవరైనా....... వేదిక ఎక్కడైనా దూకుడైన బజ్‌బాల్‌ ఆటతీరుతో సాగిపోతున్న ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని....... పట్టుదలగా ఉంది. బెయిర్‌స్టో, క్రాలీ, డకెట్‌, ఫోక్స్‌, లారెన్స్‌, పోప్‌, రూట్‌, స్టోక్స్‌తో........బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఇంగండ్‌ సొంతం. జాక్‌ లీచ్‌ మినహా టామ్‌ హార్ట్‌లీ, షోయబ్‌ బషీర్‌, రెహాన్‌ అహ్మద్‌లతో కూడిన అనుభవలేమి స్పిన్ విభాగం ఏమేరకు రాణిస్తుందో చూడాలి. అండర్సన్‌, అట్కిన్సన్‌, రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌లతో ఇంగ్లాండ్‌ పేస్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది




 



భారత్‌ తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, కెఎస్ భరత్ , రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్,  మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, 


ఇంగ్లాండ్ తుదిజట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.