Telugu breaking News: తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య

Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

ABP Desam Last Updated: 16 Feb 2024 08:00 PM

Background

Latest Telugu breaking News: టీమిండియా సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma), లోకల్‌ బాయ్‌ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) శతక గర్జన చేయడంతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు...More

రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ మృతి

మాస్కో: రష్యాలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) మృతిచెందారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన నేత నావల్నీ(47) జైలులో శుక్రవారం మృతిచెందినట్లు సమాచారం. గతంలో అలెక్సీ నావల్నీపై నమోదైన అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 19 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న నావల్నీ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆర్కిటిక్‌ ప్రిజన్ కాలనీలో నావల్నీ చనిపోయారని రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.