Brazilian model responded to Rahul Gandhi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బ్రెజిల్ మోడల్ ఇరవై రెండు సార్లు ఓటు వేశారని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఆ బ్రెజిల్ మోడల్ ఎవరో తెలుసుకునేందుకు బ్రెజిల్ లో ఆమె పని చేస్తున్న కంపెనీ వద్దకు భారతీయ విలేకరులు వెళ్లారు.కొంత మంది ఫోన్లలో సంప్రదించారు. తన ఫోటోను వాడుకుని తనపై ఆరోపణలు చేయడమే కాక.. తన ఇంటర్యూల కోసం రావడంతో ఆమె ఆశ్చర్యపోయారు. ఈ వివాదం ఓ వీడియో విడుదల చేశారు. 

Continues below advertisement

రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల 'ఓటు చోరీ' ఆరోపణల్లో తన ఫోటోను ఉపయోగించడంపై బ్రెజిల్ మోడల్  లారిస్సా రోచా సిల్వా  సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇండియాలో రాజకీయ వివాదంలో వినియోగిస్తున్నతన ఫోటో చాలా పాతదన్నారు.  వాళ్లు నా ఫోటోను ఇండియాలో ఓటింగ్ కోసం ఉపయోగిస్తున్నారు, నన్ను ఇండియన్‌గా చూపిస్తూ ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటున్నారు. చూడండి, ఎంత క్రేజీగా ఉంది! ఇది నమ్మశక్యంగా లేదని ఆశ్చర్యపోయారు.  

"నా వయసు 18-20 సంవత్సరాలు ఉన్నప్పటి ఫోటోను ఇంటర్నెట్ నుంచి తీసుకున్నారని ఆమె అన్నారు.  ఇది ఎలక్షన్ గురించా, ఇండియాలో ఓటింగ్ గురించా ఏదో! నేను బ్రెజిలియన్, ఇండియా రాలేదు. వాళ్లు నన్ను సీమా, స్వీటీ, సరస్వతి అని పిలుస్తున్నారు. ఇది పొలిటికల్ డ్రామా లాగా ఉంది   ఒక రిపోర్టర్ నా వర్క్‌ప్లేస్‌కు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాలని అడిగాడు..!" అని ఆమె ఆశ్చర్యపోయారు.   

ఇప్పుడు చాలా మంది ఇండియన్స్  తన ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారన్నారు. తనకు  నమస్తే తప్ప ఇండియన్  పదాలు తెలియవన్నారు.  ఇప్పుడు ఇండియాలో ఫేమస్ అవుతానేమో కానీ తన ఫోటోను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె అన్నారు.  2017లో బ్రెజిలియన్ ఫోటోగ్రాఫర్ మాథ్యూస్ ఫెరెరో తీసిన స్టాక్ ఇమేజ్   సైట్‌లలో ఫ్రీగా అందుబాటులో ఉంది.

బ్రెజిల్ మోడల్ స్పందనపై ..కాంగ్రెస్ఇంకా ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు.