UP Lover Naked Run On Road: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఒక సంచలనాత్మక ఘటన జరిగింది. ఒక యువకుడు, వివాహిత మహిళతో హోటల్ గదిలో ఉండగా, ఆమె భర్త , కుటుంబ సభ్యులు వచ్చిపట్టుకున్నారు. దాంతో బయపడిపోయిన ఆ వ్యక్తి నగ్నంగా దాదాపు 200 మీటర్ల పాటు నేషనల్ హైవేపై పరుగెత్తాడు
యూపీలోని హాపూర్‌లోని సింభావలీ థానా పరిధిలోని ఒక హోటల్లో ఈ ఘటన జరిగింది. వివాహిత మహిళ, ఆమె ప్రేమికుడు హోటల్ గదిలో శృంగారం చేసుకుంటూ ఉండగా విషయం తెలిసిన మహిళ భర్త, అతని బంధువులు హఠాత్తుగా హోటల్‌కు చేరుకున్నారు. భర్త ఒత్తిడితో హోటల్ సిబ్బంది గది తలుపు తెరవడంతో, లోపల ఉన్న దృశ్యం చూసి షాక్ అయ్యారు.
మహిళతో పాటు ఆ వ్యక్తి ఇద్దరూ బట్టల్లేకుండా ఉన్నారు. హోటల్ గదిలో సన్నిహిత స్థితిలో ఉన్నారు. భర్త హోటల్ సిబ్బందిని గది తెరవమని బలవంతం చేయడంతో, ఈ దృశ్యం బయటపడింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక మహిళ బాత్‌రూమ్‌లోకి పరిగెత్తింది.ఆ వ్యక్తి బట్టలు ధరించే అవకాశం లేకపోవడంతో గది నుండి పారిపోయాడు. హోటల్ కారిడార్ గుండా బయటకు పరిగెత్తి, నేషనల్ హైవేపై దాదాపు 200 మీటర్ల పాటు నగ్నంగా పరుగెత్తాడు.
మహిళ భర్త, యు బంధువులు అతన్ని వెంబడించి, ఈ దృశ్యాన్ని వీడియోలో రికార్డ్ చేశారు. ఆ ప్రియుడు హైవే వెంబడి ఉన్న పొలాల్లోకి పారిపోయి, అక్కడి పొలాల్లో దాక్కున్నాడు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. తర్వాత మహిళ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి అత్యాచారం చేయబోయాడని కేసు పెట్టింది. తనను వివాహం చేసుకుంటానని మోసం చేసి ఒక అభ్యంతరకరమైన వీడియో తీసినట్లు ఆరోపించింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు కూడా పెట్టారు. డానిష్ హైవేపై నగ్నంగా పరుగెత్తే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.