Boxer Saweety Boora Attacks Husband: అతుల్ సుభాష్ అనే టెకీ ఆత్మహత్య తర్వాత దేశంలో వివాహబంధంలో వచ్చే సమస్యల విషయంలో మగవాళ్లు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే మగవాళ్లు అనేక మంది తమ దుస్థితిని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. నిన్నటికి నిన్న ప్రసన్న అనే వ్యక్తి తన భార్య తన విషయంలో వ్యవహరిస్తున్న విధానాన్ని బయట పెట్టాడు. ఆయన ట్వీట్ వైరల్ అయింది. తాజాగా మరో జంటకు చెందిన వీడియో వైరల్ అవుతోంది.
మాజీ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ సవితి బూరా, కబడ్డీ ఆటగాడు దీపక్ నివాస్ హుడా భార్యభర్తలు. అయితే ఇద్దరి మధ్య పొసగలేదు. విడిపోవాలని డిసైడయ్యారు. ఈ మేరకు కోర్టులో విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే కోర్టు ద్వారా వచ్చే విడాకుల కన్నా ఇంకా చాలా విషయాలు సెటిల్ చేసుకోవాల్సి ఉంది కాబట్టి కుటుంబ సమావేశం పెట్టుకున్నారు. దీపక్ నివాస్ హుడాతో పాటు సవితి బూరా కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఈ సమావేశంలో ఏం జరిగిందో కానీ కాస్త వాదోపవాదుల తర్వతా బాక్సర్ బూరా ఒక్క సారిగా తన భర్త హుడాపై దాడికి పాల్పడ్డారు. ఇతరులు ఆపుతున్న పట్టించుకోండా హుడా గొంతు పట్టుకుని పంచ్‌లు విసిరారు. ఈ వీడియో వైరల్ అయింది.
వెంటనే పెద్దలు కలుగు చేసుకుని బూరా ను శాంతింప చేశారు. అయితే ఈ వీడియో మాత్రం వైరల్ అయిపోయింది. విడాకులుఇవ్వాలంటే కోటి రూపాయల భరణం ఇవ్వాలని బూరా డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలోనే మాటకుమాట పెరగడంతో దాడి జరిగిందని భావిస్తున్నారు.
అయితే అందరి ముందు బూరా భర్తపై తన బాక్సింగ్ ప్రతిభను ప్రదర్సించారంటే..ఇక వారి కుటుంబంలో..కాపురంలో ఏం జరిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు నెటిజన్లు. మగవాళ్లను .. ఆడవాళ్ల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. అదే అలాంటి సందర్భంలో ఓ మనిషి తన భార్యను కొట్టి ఉంటే సమాజం స్పందించే తీరు వేరుగా ఉండేదని చాలా మంది గుర్తు చేస్తున్నారు.