Bengal govt Jagannath temple: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దిఘాలో  250 కోట్లతో జగన్నాథ ధామ్ ఆలయాన్ని నిర్మించింది. ఘనంగా ప్రారంభించింది.  ఇందు కోసం దినపత్రికలకు రెండు పేజీల ప్రకటనలు ఇచ్చారు.  ఒడిశాలోని పురీ జగన్నాథ ఆలయాన్ని పోలిన కళింగ శైలి నిర్మాణంతో 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.   సింహద్వారం, హస్తిద్వారం, అశ్వద్వారం వంటివన్నీ కలిపి నిర్మించారు. ఈ ఆలయం ఎక్కడ ఉందో చెప్పేందుకు   బెంగాలీ,  ఇంగ్లీష్ వార్తాపత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. అందులో మ్యాప్ కూడా ఇచ్చారు.  

నావిగేషన్ మ్యాప్‌లో ఆలయానికి సమీపంలోని ల్యాండ్‌మార్క్‌లను సూచించే ఒక  చోట “Female Vibrators in Digha” అని ఒక షాపింగ్ బ్యాగ్ ఐకాన్‌తో కనిపించింది.  ఇది అమరాబతి పార్క్ , జగన్నాథ్ ఘాట్ మధ్య ఉంది. దీంతో  ఈ ప్రకటన  వైరల్ అయింది. 

నావిగేషన్ మ్యాప్ బహుశా గూగుల్ మ్యాప్స్  నుంచి స్క్రీన్ షాట్ గా తీసుకున్నారు.  కానీ దానిని సరిగ్గా పరిశీలించకుండా ప్రకటనలో చేర్చారు. “Female Vibrators in Digha” అనే షాపు ఉన్నట్లుగా చూపిస్తోంది. నిజానికి ఇలాంటి వాటికి అనుమతి  ఉండదు.   దిఘాలోని కొన్ని స్పా,  మసాజ్ పార్లర్లలో వీటిని ఉంచినట్లుగా భావిస్తున్నారు.  భారతీయ జనతా పార్టీ (BJP) ఈ తప్పిదాన్ని వెంటనే విమర్శించింది. BJP నాయకుడు అమిత్ మాలవీయ Xలో  “హిందూ సెంటిమెంట్లకు అవమానం” , “జగన్నాథ భక్తులకు అగౌరవం” అని  విమర్శించారు.  

ఈ  వివాదంపై  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి అధికారిక స్పందన రాలేదు.  మ్యాప్ డేటాను సరిగ్గా సమీక్షించకపోవడం వల్ల జరిగిందని చెబుతున్నారు. అయితే  సోషల్ మీడియా మాత్రం.. తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  కొంత మంది మాత్రం అసలు ఇచ్చిన ప్రకటనకు..లోపాలు వెదుక్కున్నదానికి సంబంధం ఉందా అని ప్రశ్నిస్తున్నారు.