Bill Gates In Love: ప్రపంచ అత్యధిక ధనవంతుల్లో ఒకరైనా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డారని సమాచారం. 60 ఏళ్ల పౌలా హర్డ్ తో బిల్ గేట్స్ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. గత నెలలో ఓపెన్ టెన్నిస్ టోర్నీ సందర్భంగా వీరిద్దరూ కలిసే కనిపించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని మ్యాచ్ చూశారు. బిల్ గేట్స్ మెలిండా ఫ్రెంచ్ ను 1994లో పెళ్లి చేసుకున్నారు వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ బిల్ గేట్స్ దాదాపు 30 సంవత్సరాల వివాహ జీవితం అనంతరం తన భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తో 2021వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. టాక్స్ ఎగ్గొట్టడం కోసమే విడాకులు తీసుకున్నారంటూ వీళ్లు విడిపోయినపుడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఒరాకిల్ సీఈఓ మార్క్ షర్డ్ మాజీ భార్యతో బిల్ గేట్స్ ప్రేమాయణం
అయితే మెలిండా ఫ్రెంచ్ తో విడాకుల తర్వాత బిల్ గేట్స్.. పౌలాహార్డ్ తో ప్రేమలో పడ్డారు. లేటు వయసులో ప్రేమలో పడ్డ బిల్ గేట్స్ మనసు దోచుకున్న పౌలాహర్డ్ ఒరాకిల్ సీఈఓ మార్క్ షర్డ్ మాజీ భార్య కావడం గమనార్హం. 2019వ సంవత్సరంలో మార్క్ హర్డ్ మరణించడంతో పౌలాహర్డ్ ఒంటరి అయ్యారు. హర్డ్ భర్త క్యాన్సర్ తో సుదీర్ఘ పోరాటం తర్వాత 2019 అక్టోబర్ లో 62 సంవత్సరాల వయసులో మరణించారు. పౌలాహర్డ్ ఈవెంట్ ప్లానర్ గా, టెక్ ఎగ్జిక్యూటివ్ గా, సామాజిక సేవకురాలిగా పని చేస్తున్నారు. పౌలా, మార్క్ దంపతులకు కాథరిన్, కెల్లీలనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరోవైపు బిల్ గేట్స్ తో విడిపోయిన తర్వాత తాను భరించలేని వేదనకు గురైనట్లు మెలిండా గేట్స్ ఇటీవల ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.