Bihar husband: పెళ్లి చేసుకున్నా సరే గతంలో తన లవర్ ను మర్చిపోలేని భార్య ఎప్పుడూ అతని తలపుల్లోనే ఉంటుది. ఆమెను బాధపెట్టడం ఇష్టంలేని భర్త చివరికి ఆమె లవర్ కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈ కథ చాలా సినిమాల్లో ఉండి ఉంటుంది. కానీ బీహార్‌లో నిజంగా జరిగింది.
బీహార్‌లో జ్యోతి అనే మహిళకు పన్నెండేళ్ల కిందట పెళ్లి అయింది.ఇప్పుడు ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో హాయిగా గడుపుతోందని అందరూ అనుకుంటున్నారు కానీ.. పెళ్లికి ముందు ఆమె బ్రిజేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతనితో ఎఫైర్ కొనసాగిస్తూనే ఉంది. పన్నెండేళ్ల వరకూ దాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. అయితే ఎప్పటికైనా బయటపడాల్సిందే అన్నట్లుగా.. ఇటీవల జ్యోతి భర్త ఈ అఫైర్ ను గుర్తించాడు. అతని గుండె పగిలిపోయింది కానీ..చాలా సినిమాలు చూసిన అనుభవం ఉందేమో కానీ తక్షణ కర్తవ్యం గుర్తించాడు.
వెంటనే వెళ్లి తన భార్య ప్రియుడు, వివాహేతర బంధం నడుపుతున్న వ్యక్తితో మాట్లాడాడు. తన భార్య ఇక తనతో ఉండదని.. నీమీదే ప్రేమ ఉందని మీకు పెళ్లి చేస్తానని చెప్పాడు. దాని ఆ లవర్ అంగీకరించాడు. ఇద్దరికీ ఆ భర్త దగ్గరుండి పెళ్లి చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అందరూ ఈ లవ్ స్టోరీని సినిమాకథతో పోల్సి వైరల్ చేస్తున్నారు.
ఇక్కడ కొనసమెరుపేమిటంటే ఆ లవర్ కూడా ఇప్పటికే పెళ్లయిపోయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ పిల్లలు అందరూ.. కలిసి ఉంటారా.. ఈ రెండో భార్యను ఇంటికి తీసుకెళ్తే ఆ మొదటి భార్య ఏమంటుంది అన్నది మరో సినిమా కథ.