Bihar elections RJD releases list of 143 candidates: బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2025 కోసం రాష్ట్రీయ జనతా దళ్ సోమవారం 143 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ను వైశాలి జిల్లాలోని రఘోపూర్ అసెంబ్లీ స్తానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ జాబితా ఇండియా బ్లాక్ లో ఆర్‌జేడీకి కేటాయించిన 143 సీట్లకు సంబంధించినది. ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగబోతున్నాయి, ఫలితాలు 14న ప్రకటించనున్నారు. ఆర్‌జేడీ జాబితాలో 24 మంది మహిళలు, యువకులు, కొత్తవారు ఉన్నారు. తేజస్వి యాదవ్ రఘోపూర్‌లో పోటీ చేయనున్నారు. ఆ స్థానం లాలూ కుటుంబానికి కంచుకోటగా ఉంది. ఈ జాబితాను పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ కలసి సిద్ధం చేశారు. కాంగ్రెస్‌కు 61 సీట్లు, సీపీఐ(ఎమ్ఎల్)కు 20 సీట్లు కేటాయించారు. ముకేష్ సహాని యొక్క వికాస్‌హీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కు మిగిలినవి కేటాయిస్తారు. అయితే, సీటు పంపిణీ అధికారికంగా పూర్తి కాలేదు, దీంతో ఆర్‌జేడీ, కాంగ్రెస్లు మూడు సీట్లలో పోటీపోతున్నారు. ఈ స్థానాల్లో పొత్తు కుదరడం లేదు.
బీహార్‌లో 243 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్‌డీఏ పార్టీల్లో బీజేపీ, జేడీయూలు సీట్లు పంచుకున్నాయి. బీజేపీకి 101 సీట్లు, జేడీయూకు 102 సీట్లు కేటాయించబడ్డాయి. ఎల్‌జేపీ (రామ్ విలాస్)కు 29, హమ్‌కు 6, ఆర్‌ఎల్‌ఎంకు 6 సీట్లు కేటాయించారు. ఇటీవల కాంగ్రెస్ 48 అభ్యర్థుల జాబితా, ఏఐఎంఐఎం 25 అభ్యర్థులు జాబితా విడుదల చేశాయి.
నామినేషన్లు ప్రారంభం కావడంతో చాలా మంది ఆయారాం గయారాంలు తయారువుతున్నారు. ఓ పార్టీ బీఫాం ఇచ్చినా మరో పార్టీ కి మద్దతు ప్రకటిస్తున్నారు.
#WATCH बिहार चुनाव 2025 | मुंगेर की तारापुर विधानसभा सीट से VIP उम्मीदवार सकलदेव बिंद ने आज उपमुख्यमंत्री सम्राट चौधरी को अपना समर्थन दिया और भाजपा में शामिल हो गए।
బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోలేదు. ఒంటరిగానే పోటీ చేస్తున్నారు.