Bhabanipur By-Election 2021 Result Live: భవానీపుర్‌లో దీదీ విజయకేతనం.. 58 వేల ఓట్ల తేడాతో గెలుపు

బంగాల్ ఉపఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. భాజపా అభ్యర్థి ప్రియాంకా టిబ్రేవాల్‌పై ఆధిక్యత కొనసాగిస్తున్నారు.

ABP Desam Last Updated: 03 Oct 2021 02:54 PM

Background

దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బంగాల్ భవానీపుర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల కౌంటింగ్ మొదలైంది. 21 రౌండ్లలో ఈ కౌంటింగ్​ జరగనుంది. భవానీపుర్​తో పాటు బంగాల్​లోని సంసేర్​గంజ్​, జంగీపుర్​ ఉపఎన్నిక ఫలితాలు కూడా వెలువడనున్నాయి.  ...More

దీదీ విజయం..

భవానీపుర్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ విజయకేతనం ఎగురవేశారు. భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు. తొలి రౌండ్‌ నుంచీ మమత ఆధిపత్యం కొనసాగించారు. 58,389 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు.